ఆదర్శ సమాజం కేవలం దైవప్రవక్త(స.అ) యొక్క అంతిమ ఉత్తరాధికారం ప్రత్యేక్షమయినప్పుడే సంభవిస్తుంది అన్న అంశాన్ని వివరిస్తున్న హదీస్.
ఇస్హాఖ్ ఇబ్నె అమ్మార్ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: ఒకరోజు నేను ఇమామ్ వద్దకు ఉన్నప్పుడు వారు వారు మానవ హక్కుల గురించి కొన్ని విషయాలు వివరించారు, అవి చూడడానికి చాలా చిన్నవి వాటిని ప్రజలు అంతగా పట్టించుకోరు. ఉదాహారణకు దైవప్రవక్త ఇలా ప్రవచించారు; “నువ్వు నీ ఇంట్లో కడుపునిండా తిని పడుకున్నావు కాని నీ పొరుగువారిలో ఒకరు ఆకలితో పడుకుండిపోయాడు అలాంటప్పుడు నీకు నేను ఒక ముస్లిం అని చెప్పుకునే అర్హత లేదు” ఇలా కూడా ప్రవచించారు; “నీ ఇంటికి 40 ఇళ్ళ వరకూ నీ పొరుగు, నీవు వాళ్ళ గురించి తెలుసుకోవడం నీ బాధ్యత. కళ్ళుమూసుకొని నడవకు దారి మధ్యలో రోగులకు, లేనివారికి, నిస్సహాయులకు ఉంటారు(వారికి తోచినంత సహాయం చేయి)”.
రావీ ఇలా అన్నాడు: ఇమామ్ ఈ మాటలు చెబుతుంటే నాలో తెలియని అలజడీ, ఇవన్నీ మానవ హక్కులైతే ఇక మా సంగతి అంతే, మేము ముస్లిములేనా?, (అన్న ప్రశ్నుల ఎర్పడ్డాయి) అందుకే వెంటనే ఇమామ్ ను “స్వామీ మేము నాశనమైపోయినట్లే, ఎందుకంటే మీరు చెప్పి గుణాలన్నీ మాలో లేవు గనక”.
నా అంతర్ స్థితిని గ్రహిస్తూ ఇమామ్ ఇలా ప్రవచించారు: “నేను చెప్పినవి ఒక ఆదర్శ సమాజం యొక్క రూపం, అలాంటి అందమైన ఆదర్శ సమాజం కేవలం “ఖాయం” వచ్చినప్పుడే సంభవిస్తుంది, కాని గుర్తుపెట్టుకోవలసిన విషయమేమిటంటే అంలాటి సమాజం మా ఇమాములందరి అభిలాష అందుకని ఎంత వరకు సాధ్యమైతే అంత వరకు ఆ అందమైన చిత్రింలో రంగులు నింపేందుకు ప్రయత్నించడి. ఈనాడు కూడా ఒకరిగురించి మరొకరు తెలుసుకొని వారికి సహాయ పడడం అవసరం. ఎవ్వరు కూడా ఇతరుల అపజయాలను మరియు బలహీనతలను చూసి సంతోషపడకూడదు. వారి సుఖదుఖాలను మనసులోతు నుండి స్పర్శించండి. ఒకరినొకరు మరవకండి, అలా చేస్తే వాళ్ళ మధ్య తరగతులు ఏర్పడతాయి, దాంతో సమాజంలో విద్రోహం అల్లకల్లోలం చోటుచేసుకుంటుంది, మరి విద్రోహం అల్లాహ్ కు గాని మాకు గాని ఏమాత్రం ఇష్టం ఉండదు.[కమాలుద్దీన్, భాగం2, పేజీ33-38]
రిఫ్రెన్స్
షేఖ్ సదీఖ్, కమాలుద్దీన్ వ తమామున్నిఅమహ్.
వ్యాఖ్యానించండి