ఇమాం మొహమ్మద్ బాఖిర్[అ.స]ల వారి పరామర్శ

బుధ, 01/30/2019 - 19:02

తమ శత్రువులతో కూడా ప్రేమగా మలుచుకోవటం ఇమాములకు(ఉత్తరాధికారులకు) మహాప్రవక్త[స.అ]ల వారి నుండి వారికి వారశత్వంగా అందిన లక్షణం.

ఇమాం మొహమ్మద్ బాఖిర్[అ.స]ల వారి పరామర్శ

షాం(డమాస్కస్) నుంచి వచ్చిన ఒక వ్యక్తి మదీనాలో నివశించసాగాడు అతను ప్రతీ రోజూ ఇమాం బాఖిర్[అ.స]ల వారి వద్దకు విధాభ్యాసం కొరకు వచ్చేవాడు, ఒక రోజు ఇమాం[అ.స] వారిని క్రింది పరుస్తూ ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: నా హ్రుదయంలో మీకన్నా ఎక్కువ ఎవరి పట్ల పగ,ద్వేషం లేదు మరియు నా ద్రుష్టిలో మీరు మరియు మీ వంశం తప్ప ఎవరు ఈ ద్వేషానికి అర్హులు కారు మరియు నా ఆలోచనలో ఆ అల్లాహ్,ప్రవక్తల మరియు అమవి ఖలీఫాల సామిప్యం(దగ్గరవ్వటం) మీ పట్ల ద్వేషాన్ని ప్రదర్శించటంలోనే ఉంది, నేను కేవలం మీ విద్య మరియు మీ వాక్చాతుర్యం వలనే మీ వద్ద విధ్యాభ్యాశం కొరకు వస్తున్నాను.  కానీ ఇమాం బాఖిర్[అ.స]ల వారు ఎప్పుడూ అతని అవమాననికి జవాబుగా ఏమీ చెప్పలేదు,అతనితో ఉత్తమంగానే ప్రవర్తించేవారు.
కొన్ని రోజుల తరువాత అతను(షామీ) అనారోగ్యం పాలయ్యాడు మరియూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో అనుకున్నాడు,అతని మిత్రులు అతను అనారోగ్యం పాలై ఆఖరి క్షణాలను గడుపుతున్నాడన్న విషయాన్ని ఇమాం(అ.స)ల వారికి తెలియజేసారు.
విషయాన్ని తెలుసుకున్న ఇమాం బాఖిర్[అ.స]ల వారు అతని ఇంటికి వెళ్ళి అతని తల భాగం వైపు కూర్చున్నారు,అతను లేచి కూర్చో లేని పరిస్తితిలో ఉండటం చూసి ఇమాం[అ.స]ల వారు అతనిని కూర్చోబెట్టి ఒక పానీయాన్ని(మందును) తెప్పించి అతనితో త్రాగించారు అతని సహచరులతో ఆ అతనికి ఆహారన్ని చల్లబరచిన తరువాత తినిపించమని చెప్పి వెళ్ళిపోయారు.
ఇమాం[అ.స]ల వారి దయతో ఆ వ్యక్తి కోలుకున్నాడు మరియు ఇమాం[అ.స]ల వారి నైతిక గుణాలతో ప్రభావితుడై వారితో క్షమాపన కోరి వారి ప్రియమిత్రులలో ఒకరిగా అయ్యాడు.

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,46వ భాగం,పేజీ నం:263.      

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19