దాసుల పరీక్ష ఎందుకు?

గురు, 01/31/2019 - 09:20

ఎలగైతే నిజమైన యుద్ధానికి ముందు సైనుకులను వివిధ రకాలుగా పరీక్షిస్తారు తద్వారా వారు నిజమైన యుద్ధానికి అర్హులవుతారు ఆ అల్లాహ్ కూడా తన దాసులను ఈ లోకంలో వివిధ రకాలుగా పరీక్షించి వారిలో ఉన్న సామర్ధ్యాన్ని బయటకు తీసి నిజమైన పరీక్షలో వారు ఉత్తీర్ణులయ్యేలా వారిని తయారు చేస్తాడు.

దాసుల పరీక్ష ఎందుకు?

మనము ఈ లోకంలో కొన్ని కారణాల వల్ల ఇతరులను పరీక్షిస్తూ ఉంటాం ఎందుకంటే మనకు వారి పట్ల జ్ఞానం లేదు కానీ ఆ అల్లాహ్ విషయంలో అలా కాదు అతనికి మాత్రం అంతా తెలుసు మరి ఎందుకు అతను తన దాసులను పరీక్షిస్తాడు?
ఈ ప్రశ్న యొక్క జవాబు: ఈ లోకంలో మనము చేసే పరీక్ష కేవలం ఆ విషయం పట్ల మనకున్న అజ్ఞానన్ని దూరం చేయడం కోసమే కానీ అల్లాహ్ చేసే పరీక్షకు కారణం మన లాగ కాదు ఈ లోకంలో అతని జ్ఞానంలో లేని వస్తువంటూ ఏదీ లేదు మరియు అజ్ఞానాన్ని అల్లాహ్ తో జోడించడం కూడా సరికాదు మరి ఆ అల్లాహ్ తన దాసులను పరీక్షించడానికి గల కారణం ఎమిటి?
ఆ అల్లాహ్ పరీక్షకు కారణం అతను తన దాసులలో దాగున్న సామర్ధ్యాలను బయటకు తీసి అతన్ని ఉన్నతశిఖరాలకు చేరవేయడమే వేరే ఒక మాటలో చెప్పాలంటే ఆ అల్లాహ్ తన దాసులను పరీక్షించేది వారి శిక్షణ మరియు వారి పోషణ కొరకే,ఎలగైతే లోహాన్ని భట్టీలో వేసి దాన్ని కాల్చి కరిగించి వేరే వస్తుల తయారికి అది ఉపయోగపడేలా దానిని మారుస్తారో అదే విధంగా ఆ అల్లాహ్ కూడా తన దాసులను ఎన్నో విషయాలలో పరీక్షించి వారిలో గల నైపుణ్యాన్ని బయటకు తీసి వారిని మరియు అల్లాహ్ పై గల వారి విశ్వాసాన్ని ద్రుఢంగా చేయటం కొరకే (వారిని పరీక్షిస్తాడు). 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10