నమాజ్ ప్రాముఖ్యత మరియు దానిని తేలికగా భావించిన పరిస్థితి మరియు ఆపదలు దైవప్రవక్త[స.అ] దృష్టిలో
నమాజ్ ప్రాముఖ్యతను వివరించే దైవప్రవక్త[స.అ] హదీసులు:
1. నమాజ్ ను తేలికగా భావించేవాడు మా (అనుచరుల) నుండి కాదు
2. నమాజ్ ను నాశనం చేసిన ప్రతీ ఒక్కడు, (అంతిమ దినాన) ఖారూన్ మరియు హామాన్ లతో లేపబడతారు
3. నమాజ్ ను నాశనం చేసిన ప్రతీ ఒక్కడు, కపటవర్తనులతో నరకాగ్నిలో ప్రవేసించబడతాడు
4. నమాజ్ ను తేలిక మరియు అల్పముగా భావించే వారికి (ప్రళయంనాడు) నా మద్దత్తు వాడికి చేరదు
5. నమాజ్ ను దాని ఆరంభ సమయంలోనే చదివే నమాజీని చూసి షైతాన్ నిరంతరం న భయపడుతూ ఉంటాడు, కానీ నమాజ్ ఆరంభ సమయాన్ని అంతగా పట్టించుకోకపోతే షైతానుకు ధైర్యం పుట్టుకొస్తుంది మరియు అతడిని మహాపాపములకు పాల్పడే విధంగా చేస్తాడు
రిఫ్రెన్స్
జావాహిరుల్ కలామ్, ఉర్వతుల్ ఉస్ఖా మరియు వసాయిల్ అల్ షియా నుండి తీసుకున్న సరైన హదీసులు.
వ్యాఖ్యానించండి