"బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం"ప్రాముఖ్యత హదీసులలో!

శని, 02/02/2019 - 15:52

ప్రతీ పనిని ఆ అల్లాహ్ పేరుతో ప్రారంభించడం వలన సాఫల్యం తప్పక ప్రాప్తిస్తుంది. 

"బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం"ప్రాముఖ్యత హదీసులలో!

ప్రతీ దూఅ ముందు "బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం": దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరైతే దూఅ చేసే ముందు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం చదువుతారో ఆ దూఅ తిరస్కరింపబడదు.[అద్ దావాత్,పేజీ నం: 52].
వుజూకు ముందు "బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం": మహనీయప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా ప్రవచించారు: ఎవరైతే వుజూ చేసే ముందు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం చదువుతారో అతని అన్ని అవయవాలు పాపాల నుంచి శుధ్ధి చేయబడతాయి.(వసయెలుష్ షియా,1వ భాగం,పేజీ నం: 398).
ప్రతీ పని ముందు "బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం": ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరైతే ఎదైనా చెప్పాలి లేదా ఏ పనైనా చేయాలి అనుకుంటాడో అతను బిస్మిల్లహిర్రహ్మానిర్రహీం చదవవలెను దానితో అతనికి ఆ పనిలో వృధ్ధి,లాభం కలుగుతుంది. [తఫ్సీరే ఇమాం హసన్ అస్కరి[అ.స],పేజీ నం:25].
కష్టాల నుండి విముక్తికి "బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం": ఇమాం కాజిం[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎదైనా పనిలో ఇబ్బందులు కలిగి అవి బాధించినప్పుడు ఎవరైతే తన తలను ఆకాశం వైపుకు ఎత్తి మూడు సార్లు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం చదువుతారో ఆ అల్లాహ్ అతని ఆ పనిలో కష్టాలను తొలగించి అతని బాధను దూరంచేస్తాడు.[మకారిముల్ అఖ్లాఖ్,పేజీ నం:347].

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7