ఆపదలకు కారణం

శని, 02/02/2019 - 19:23

ఆపదలు కలగటానికి గల కారణాలలో ఒక కారణం ఇమాం సజ్జాద్(అ.స)ల వారి నోట.

ఆపదలు వాటిల్లటానికి గల ఒక కారణం

ఇమాం సజ్జాద్[అ.స]ల వారు తన కుటుంబ సభ్యులకు ఈ విధంగా ఆజ్ఞాపించేవారు: "ఏ ఒక్క పేదవాడు నా ఇంటిని తన కడుపు నింపుకోకుండా దాటరాదు".
ఒకసారి వారి మాటకు విరుద్ధంగా "బిక్షాటన చేసే ప్రతీ వాడు నిజంగా పేదవాడు కాదుగా"
అని చెప్పటం జరిగింది,దానికి ఇమాం సజ్జాద్[అ.స]ల వారు ఈ విధంగా బదులిచ్చారు:
నాకు దేనివలన భయమంటే ఒక వేళ ఆ భిక్షవాడు నిజంగానే బీదవాడై ఉంటే మనము ఆ బీదవాడిని చీదరించి ఏ ఆపదైతే హజ్రత్ యాఖూబ్[అ.స]ల వారిపై వచ్చినదో ఆ ఆపదకు మనమూ బాధ్యులు కాకూడదు, హజ్రత్ యూసుఫ్(అ.స)ల వారు ఆ ప్రసిద్ధమైన కలను అదే రాత్రి కనటం జరిగింది మరియు అదే రాత్రి హజ్రత్ యఖూబ్[అ.స] ల వారు ఆ బీదవాడిని చీదరించటం(తిరస్కరించటం) జరిగింది,ఆ రాత్రి యాఖూబ్[అ.స]ల వారు మరియు వారి కుటుంబసభ్యులు నిండకడుపున పడుకోవటం మరియు ఆ బీదవాడు ఖాళీకడుపున పడుకోవటం జరిగింది. 
అల్లాహ్ వారితో ఈ విధంగా పలికెను: "ఓ యఖూబ్! ఎందువలన నా దాసునిపై (ఆ రాత్రి) కరుణించలేదు? నా మానం(ప్రతిష్ట)పై ఒట్టేసి చెబుతున్నాను నిన్ను నీ కుమారునిని ఆపదకు గురిచేస్తాను".(ఆపదలో చిక్కుకున్నట్టుగా చేస్తాను).

రెఫరెన్స్
ఇలలుష్ షరాయె,1వ భాగం,పేజీ నం: 161.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17