నమాజ్ దొంగ

ఆది, 02/03/2019 - 16:37

దొంగతనాలు ఎన్నో రకాలు వినుంటారు కాని ఇమామ్ చెబుతున్న ఈ దొంగతనం విను ఉండరు.

నమాజ్ దొంగ

నమాజ్ ను ఎలా చదవాలి అన్న విషయం మన ఉలమాలు ఖుర్ఆన్ మరియు హదీస్ ను బాగా పరిశీలించిన తరువాత వివరించారు. కాని మేము నమాజ్ ను ఎలా చదవాలో అలా చదవకుండా మనకు ఇష్టం వచ్చినట్లు చదువుతాము, అందులో కొన్ని పదాలను పలకము, పరిపూర్ణ నమాజ్ ఎలా చదవాలో అలా చదవము. అలా నమాజ్ చదవనివాడిని ఇమామ్ అలీ[అ.స] ఏమంటున్నారో తెలుసుకుందాం:
ఇమామ్ అలీ[అ.స] మస్జిద్ లో ఉండగా, ఒక వ్యక్తి మస్జిదులోకి వచ్చాడు, వచ్చి నిలబడి నమాజ్ మొదలెట్టాడు కాని అతడు నమాజ్ పూర్తిగా చదవడం లేదు. ఇమామ్ ఇలా అన్నారు: “నువ్వు జీవితాంతం ఇలాగే నమజ్ చదివితే నువ్వు ముస్లిముగా మరణించవు. ఆ తరువాత ఇలా అన్నారు: “నమాజ్ నుండి దొంగలించడం కన్న పెద్ద దొంగతనం లేదు”(అనగా నమాజ్ ను స్పష్టంగా పూర్తిగా ఇస్లాం చెప్పిన విధంగా చదవండి అని అర్థం).   

రిఫ్రెన్స్
జావాహిరుల్ కలామ్, ఉర్వతుల్ ఉస్ఖా మరియు వసాయిల్ అల్ షియా నుండి తీసుకున్న సరైన హదీసులు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7