.ఖుర్ఆన్ యొక్క 7వ సూరహ్ గురించి సంక్షిప్తంగా తెలుసుకొండి.
ఖుర్ఆన్ యొక్క ఏడవ సూరహ్ ఇది. “అఅరాఫ్” అనగ “ఎత్తైన ప్రదేశం” మరియు “స్వరం మరియు నరకం మధ్య గల అంతరం”. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 46 వ ఆయత్. ఈ సూరాలో అఅరాఫ్ అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్‍లో 2 సార్లు వచ్చింది. ఈ సూరాలో 206 ఆయత్‍లు, 3341 పదాలు మరియు 14437 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 61 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “సాద్” సూరా మరియు దీని తరువాత “జిన్” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు “అఅరాఫ్” అని పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది పూర్తి ఖుర్ఆన్‍లో అఅరాఫ్ పదం రెండు సార్లు వచ్చింది అది కూడా కేవలం ఈ సూరహ్‍లోనే మరియు రెండవ కారణం అఅరాఫ్ అనుచరుల సంఘటన ఈ సూరహ్‍లోనే ఉంది. ఈ సూరహ్ ప్రత్యకత ఏమిటంటే ఖుర్ఆన్‍లో ఉన్న మొట్టమొదటి ముస్తహబ్ సజ్‍దా ఇందులోనే ఆయత్ 206లో ఉంది.
వ్యాఖ్యానించండి