చిన్న వయసులో నమాజ్

ఆది, 02/03/2019 - 17:48

ఏ వయసు గల పిల్లలను నమాజ్ చదవమని ఆదేశించాలి, అన్న విషయం పై కొన్ని హదీసుల నిదర్శనం.

చిన్న వయసులో నమాజ్

1. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[స.అ] ఉల్లేఖనం: మేము మా పిల్లలకు 5 సంవత్సరాల వయసు నుండి నమాజ్ చదవమని చెబుతాము, మీరు 7 సంవత్సరాల వయసు నుండి నమాజ్ చదవమని చెప్పండి.
2. ఒక వ్యక్తి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “ఎన్ని సంవత్సరాల వయసులో మన పిల్లలకు నమాజ్ చదవమని ఆదేశించాలి?” ఇమామ్ “ఆరు లేదా ఏడు సంవత్సరాల వయసులో” అని అన్నారు.
3. ఒక వ్యక్తి ఇమామ్ అలీ రిజా[స.అ] వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “నా కుమారుడు ఒక్కోసారి ఒకరోజు లేదా రెండేసి రోజులు నమాజ్ ను చదవడం లేదు” అప్పుడు ఇమామ్ “ఎన్ని సంవత్సరాలు?” అని అడిగారు. అతడు “ఎనిమిది సంవత్సరాలు” అన్నాడు. ఇమామ్ ఆశ్చర్యంగా “సుబ్హానల్లాహ్! ఎనిమిది సంవత్సరాల వయసు మరియు అప్పుడప్పుడు నమాజ్ చదవడం లేదు!". ఇలా చెప్పబడింది!. పిల్లాడు కదా ఒక్కోసారి అలసట మరియు కలత ఉంటుంది. ఇమామ్ ఇలా అన్నారు: “ఎలా కుదురితే అలా నమాజ్ చదవాలి”.

రిఫ్రెన్స్
జావాహిరుల్ కలామ్, ఉర్వతుల్ ఉస్ఖా మరియు వసాయిల్ అల్ షియా నుండి తీసుకున్న సరైన హదీసులు.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11