సాఫల్యానికి మూడు సూత్రాలు ఇమాం సజ్జాద్[అ.స] ద్రుష్టిలో!

సోమ, 02/04/2019 - 17:26

.ఇమాం సజ్జాద్[అ.స]ల వారి ద్రుష్టిలో సాఫల్య జీవితానికి మూదు సూత్రాలు.

సాఫల్యానికి మూడు సూత్రాలు ఇమాం సజ్జాద్[అ.స] ద్రుష్టిలో!

ఇమాం సజ్జాద్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
మూడు అంశాలు మానవుని జీవితం సాఫల్యం కావటానికి కారణమవుతాయి:
1.తన నాలుకను తన ఆధీనంలో పెట్టుకోవటం మరియు దానిని ఇతరుల చాడీల నుండి కాపాడుకోవటం.
అదే విషయాన్ని ప్రస్థావిస్తూ అల్లహ్ దైవ ఖురాన్ లో ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నడు: మీలో ఎవరూ ఇంకొకరి గురించి వీపు వెనకాల చెడుగా(చాడీలు) చెప్పుకోకూడదు.ఏమిటి,మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా?[అల్ హుజురాత్/12].
2.ఏ పనులైతే ఇహపరలోకాలలో తనకు లాభాన్ని చేకూరుస్తాయో వాటిలో నిమజ్ఞమై ఉండటం.
ఆ అల్లాహ్ ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నవారితో ఈ విధంగా సంభోదిస్తున్నాడు: “అల్లాహ్ వారికి ప్రాపంచిక ఫలాన్ని ఇచ్చాడు .పరలోకపు ఉత్తమ పుణ్యఫలాన్ని కూడా ప్రసాదించాడు.సత్కార్యాలను ఉత్తమరీతిలో నిర్వర్తించే వారిని అల్లాహ్ ఎంతగానో ప్రేమిస్తాడు”.[ఆలి ఇమ్రాన్/148].
3.తన పాపాల(క్షపణ) కొరకు ఆ దేవుని సన్నిధిలో విలపించడం.
ఆ దేవుని సన్నిధిలొ విశ్వాసులు వేడుకునే విధానాన్ని ఈ విధంగా ప్రస్థావిస్తుంది: “వారు విలపిస్తూ,ముఖాల ఆధారంగా(సాష్టాంగ) పడిపోతారు.ఈ ఖురాన్ వారి అణుకువను(వినమ్రతను) మరింత పెంచుతుంది”[అల్ ఇస్రా/109].

రెఫరెన్స్:
తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ నం:28.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6