అబద్ధం చెప్పడాన్ని ఇస్లాం నిషేదిస్తుంది అని తెలిసి కూడా ఎవరైనా అబద్ధం చెబుతున్నాడూ అంటే అతడు పాపము చేస్తున్నాడు అని అర్ధం, అలాంటి వాడి మటలను నమ్మకూడదు.
అబద్ధం మహా పాపం, అబద్ధాన్ని ఇస్లాం నిషేదిస్తుంది. అబద్ధం చెప్పడం సరికాదు అని ప్రతీ వివేకి సమ్మతిస్తాడు, అంతేకాదు అబద్ధం చెబుతున్నవాడికి కూడా తను చేస్తుంది సరికాదు అని తెలుస్తుంది అయినా తన స్వార్ధం కోసం అబద్ధం చెప్పేస్తాడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనిషి తన స్వార్ధం కోసం ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటాడు కాని దాంతో ఎదుటివారికి ఎంత నష్టం కలుగుతుందో మరి ఆ అబద్ధం వలన తన ఆత్మపై ఎంత చెడు ప్రభావం పడుతుందో అర్ధం చేసుకోవడం లేదు. నిజానికి అబద్ధం మద్యపానం కన్నా నీఛమైనది.
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ప్రవచనం: “అల్లాహ్ దౌష్ట్యానికి తాళాలు నిశ్చయించి ఉంచాడు, ఆ తాళానికి మధ్యం తాళం చెవి(లాంటిది), మరి అబద్ధం చెప్పటం మద్యం సేవించటం కన్నా నీఛమైనది”.[ఉసూలె కాఫీ, భాగం3, పేజీ339]
హదీస్: ِاِنَّ اللّهَ عَزَّ وَ جَلَّ جَعَلَ لِلشّرِّ اَقْفالا وَجَعَلَ مفاتیحَ تِلْکَ الاَْقْفالِ اَلشَّرابَ، وَ الْکِذْبُ شَرٌّ مِنَ الشَّرابِ
రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, ఉసూలె కాఫీ.
వ్యాఖ్యానించండి