ఒక విశ్వాసి ఎప్పుడూ అబద్ధం చెప్పడు, అంటే అబద్ధం చెప్పేవాడు విశ్వాసి కాలేడు అని అర్ధం.
హదీస్ గ్రంథాలాలలో ఉల్లేఖించబడ్డ సరైన హదీసులనుసారం ఒక విశ్వాసి ఎప్పుడూ అబద్ధం చెప్పడు అని తెలుస్తుంది. ఒక రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: దైవప్రవక్త[స.అ]తో ఇలా ప్రశ్నించారు.. ..ఒక విశ్వాసి పిరికివాడై ఉంటాడా?. దైవప్రవక్త[స.అ]: ఔను ఉండోచ్చు అని అన్నారు.
ఆ తరువాత విశ్వాసి పిసినారి అయి ఉంటాడా?, అని ప్రశ్నించారు, దైవప్రవక్త[స.అ] ఔను ఉండోచ్చు అని అన్నారు
ఆ తరువాత విశ్వాసి అసత్యుడై ఉంటాడా?, అని ప్రశ్నించారు, దైవప్రవక్త[స.అ] “కాదు” (ఒక విశ్వాసి అసత్యుడై ఉండడడు) అని అన్నారు.[జామివుస్సాదాత్, భాగం2, పేజీ322]
ఇమామ్ అలీ[అ.స] ఇల్లేఖనం: “అసత్యం పలకడం మానేయనంత వరకు మనిషి విశ్వాసం యొక్క రుచి చూడలేడు, ఆ అబద్ధం జోక్ గా అయనా లేకా సీరియస్ గా అయిన సరే”[ఉసూలె కాఫీ, భాగం2, పేజీ 340, హదీస్11]
రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, ఉసూలె కాఫీ మరియు జామివుస్సాదాత్.
వ్యాఖ్యానించండి