యువత నమాజుకు దూరమవ్వటానికి కారణం

ఆది, 02/17/2019 - 19:05

యువత నమాజుకు దూరమవ్వటానికి గల కారణాలలో కొన్నింటిని ఇక్కడ ప్రస్థావించటం జరిగింది.

యువత నమాజుకు దూరమవ్వటానికి కారణం

ఈ కాలంలో నమాజుకు దూరమవుతున్న వారిలో యువత ముఖ్యమైనది,వారు నమజు పట్ల అశ్రధ్ధ వహించటానికి ఎన్నో కారణాలున్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలను ఇక్కడ ప్రస్థావించడం జరిగింది:
1-నమాజు పట్ల పూర్తి జ్ఞానం లేక పోవటం: నమాజు పట్ల,దాని ప్రాముఖ్యత పట్ల,దాని ప్రభవాల పట్ల,దాని సత్ఫలితాల పట్ల జ్ఞానం లేకపోడం దాని నుండి దూరంగా ఉండటానికి ఒక కారణం అని చెప్పవచ్చు.ఎందువలన దివ్య ఖురాన్ లో వెయ్యి ఆయతులలో నమాజు ప్రస్థావనకు వచ్చింది? హదీసులలో చాలా చోట్ల నమాజు గురించి ఎందుకు తాకీదు చేయటం జరిగింది? ఎందువలన వసాయెలుష్ షీయా మరియూ ముస్తద్రకుల్ వసాయెల్ వంటి హదీసు పుస్తకాలలో 19000  హదీసులు కేవలం నమాజు దాని వివరణపైనే ప్రస్థావించబడ్డాయి? వీటన్నింటికి కారణం ఇస్లాములో నమాజుకు గల ప్రాముఖ్యతను తెలియ జేయటం కాదా?
2-దురాచారులు మరియు చెడ్డవారితో స్నేహం: స్నేహం అనేది మానవుని ప్రవర్తన మరియు అలవాట్లలో చాలా ప్రభావాన్ని చూపుతుంది ప్రత్యేకంగా యవ్వన కాలంలో,ఒక మంచి స్నేహితుడు ఉన్నతశిఖరాలకు ఎదగటానికి కారణమైతే ఒక చెడ్డ స్నేహితుడు చెడిపోవటానికి కారణమవుతాడు.అదే విధంగా నమాజు చేయని వారితో స్నేహం మిమ్మల్ని కూడ ఒక బేనమాజీగా(నమాజు చేయని వాడుగా) మార్చేస్తుంది.
3-నమాజు నెలకొల్పకుండా ఉండటానికి షైతాను చేసే ప్రయత్నాలు: దివ్య ఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “సారాయి,జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని,ద్వేషాన్ని స్పజించాలని,అల్లాహ్ స్మరణ నుంచి,నమాజు నుంచీ మిమ్మల్ని దూరంగా ఉంచాలని షైతాను కోరుకుంటున్నాడు.కనుక ఇకనైనా వాటిని మానుకోండి”(అల్ మాయిదా/91).
4-నమాజును తేలికగా తీసుకోవడం: ఇమాం సాదిఖ్(అ.స) ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే నమాజును తేలికగా తీసుకుంటారో వారికి మా సిఫారసు వర్తించదు”(మేము అల్లహ్ వద్ద అతని కోసం సిఫార్సు చేయము).

(అల్ మహాసిన్,1వ భాగం,పేజీ నం:80).

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9