నీ మనసే నీ శత్రువు!

సోమ, 02/18/2019 - 19:47

ఇతరులకు హితబోధనలు చేసే కన్న తనకుతాను హితబోధ చేసుకునే వాడే ఆ అల్లాహ్  సన్నిధికి సాఫల్యుడిగా తెరిగివెళ్ళగలడు.

నీకు నీవే శత్రువు!

ఈ లోకంలో మన కంటికి కనబడే శత్రువులను మనము చూడగలుగుతాము మరియు ఎల్లప్పుడూ వారిని ఎదుర్కునేందుకు సిధ్ధంగా ఉంటాము, వారు చేసే విఫలయత్నాలను వారిపైనే తిప్పి కొట్టడానికి ప్రయత్నిస్తాము అలాగే మనకు కంటికి కనబడని శత్రువులు కూడా ఉంటారా? అన్న ప్రశ్న కూడా పుడుతుంది,దానికి జవాబు అవునే అని చెప్పవచ్చు, మన కంటికి కంబడని శత్రువు ఎవరో కాదు అది మన మనసే(మన ఆత్మే),ఇస్లాములో దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని దానిని అధీనంలో పెట్టుకోకపోతే వచ్చే సమస్యలను సైతం వివరించటం జరిగింది.
ఈ లోకంలో సమస్యలన్ని ఈ మనసు మాటలను వినటం ద్వారానే కొనితెచ్చుకుంటాము,ఎక్కడైతే ఆ దేవుని ఆజ్ఞపాలన కంటే మనసు ఆజ్ఞపాలన మరియు దాని కోరికలను తీర్చటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందో అక్కడ అన్ని దోరకవచ్చు ఒక్క ఆ భగవంతుడు తప్ప,అలాంటి తరుణంలో అన్నింటిని వదిలి(మనసుకు విరుధ్ధంగా) ఆ అల్లాహ్ ఆజ్ఞపాలన చేస్తూ అతని శరణుకోరుకోవటం ద్వారానే జీవితసాఫల్యతను పొందవచ్చు. ఆ అల్లాహ్ దివ్య ఖురానులో ఈ విధంగా సెలవిస్తున్నాడు:
(యూసుఫ్ ఈ విధంగా పలికెను) “నేను నా మనసు పవిత్రతను గురించి చాటుకోవడం లేదు,నిస్చయంగా మనసైతే చెడువైపుకే పురికొల్పుతుంది,అయితే నా ప్రభువు దయదలచిన వారి విషయంలో మటుకు అలా జరగదు.నిస్సందేహంగా నా ప్రభువు అపారంగా క్షమించే వాడు,అమితంగా దయదలిచేవాడు” (యూసుఫ్/53).
ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “ఆ అల్లాహ్ వద్ద ఏ మనసైతే ఆ అల్లాహ్ ఆజ్ఞపాలన చేస్తుందో దాని కన్నా విలువైన వస్తువు ఈ భూమండలంపై లేదు”.

రెఫరెన్స్
తస్నీఫె గురరుల్ హికం వ దురరుల్ కలిం,పేజీ నం:182,హదీసు నం:3408.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10