నమాజె షబ్ విశిష్టతలు

శుక్ర, 02/22/2019 - 18:22

నమాజె షబ్ ప్రాముఖ్యత గురించి ఖుర్ఆన్ మరియు సున్నత్, రెండిటిలో వివరించబడి ఉంది. దాని కొన్ని విశిష్టత సంక్షిప్త వివరణ. 

నమాజె షబ్ విశిష్టతలు

నమాజె షబ్, చాలా ఎక్కువ పుణ్యంతో కూడివున్న నమాజ్. అది చాలా ప్రతిష్టాత్మకమైనది. రివాయతులలో 30కి మించి దాని శ్రేష్టతలు సూచించబడి ఉన్నాయి. వాటి నుండి కొన్ని..
1. దైవప్రవక్తలందరికీ నమాజె షబ్ అనేది ఉండేది.
2. నమాజె షబ్ లో శరీర ఆరోగ్య రహస్యం ఉంది.
3. నమాజె షబ్ ద్వార సమాధిలో వెలుగు ఉంటుంది.
4. నమాజె షబ్ సద్గుణాలలో, భాగ్యంలో, కష్టాలను దూరం చేయడంలో, అప్పుతీర్చబడడంలో, కంటిచూపులో ప్రభావితమైనది.
5. నమాజె షబ్, పాపాలను తొలగిస్తుంది, అది ప్రళయదినాన ప్రకాశిస్తుంది.
6. విశ్వాసి యక్క గౌరవం నమాజె షబ్ లో ఉంది.
7. అబూజర్ కాబా వద్ద నిలబడి సమాధి మొదటి రాత్రి పట్ల భయం మరియు ఒంటరితనం పోవాలంటే అర్ధరాత్రి నమాజె షబ్ మరవకండి అని బోధించేవారు.
8. నమాజె షబ్ చదవనివాడే కష్టాలలో ఉంటాడు.
9. ఇతరులను భోజనం పెట్టేవారు, గట్టిగా సలామ్ చేసేవారు మరియు అర్ధరాత్రి అందరూ పడుకొని ఉన్న సమయంలో నమాజే చదివే వారే మీరందరిలో చాలా మంచివారు.
10. మనిషి యొక్క పాపాలు, చెడు తీరు అతనిని నమాజె షబ్ నుండి దూరం చేస్తుంది. [దయాయిఖీ బా ఖుర్ఆన్, 119]

రిఫ్రెన్స్
మొహ్సిన్ ఖిరాఅతీ, దఖాయికి బా ఖుర్ఆన్, ముఆవినతె ఫర్హనంగ్ వ ఇజ్తిమాయియే సాజ్మానె ఔఖాఫ్ వ ఉమూరె ఖైరియ్యహ్, 1392.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13