పరోపకారులే ఆ దేవునికి సన్నిహితులు

ఆది, 02/24/2019 - 11:18

ప్రకృతి నుంచి అన్ని రకాల ఉపయోగములు పొందుచూ సుఖంగా జీవించే మనిషి కూడా వీలైనంత వరకూ పరోపకారము చేయుచూ స్వార్ధ,ఆశ,పిసినారితనము వంటి వాటిని వదిలి త్యాగబుధ్ధితో జీవిస్తే అతని జన్మము సార్ధకమైనట్లే.     

పరోపకారులే ఆ దేవునికి సన్నిహితులు

పరోపకార లక్షణం అనేది ఒక మతానికి లేదా ఒక జాతికి చెందినది కాదు మానవత్వం ఉన్న ప్రతీ మనిషిపై ఇతరులకు సహాయం చేయడం అనేది తోటి మానవునిగా మన కర్తవ్యం.ఈ సమస్త ప్రకృతిని ఆ భగవంతుడు పరోపకారమును మరియు త్యాగబుధ్ధి గల దానిగా సృష్టించడం జరిగింది,పరిశీలించి చూచినచో ఈ ప్రకృతిలో ఒక జీవి మరొక జీవికి ఉపయోగపడేలా ఉంటుంది,అడవులలో పెరిగే చెట్లు,ఇంట్లో మనము పెంచుకునే గేదులు మరియూ ఎన్నో ఇతర జీవులు మానవునికి ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. కానీ ఈ మనవుడు మాత్రం వాటి త్యాగాన్ని మరిచి దానికి వ్యతిరెకంగా వాటి హానిని కోరుకుంటాడు,ఈ రోజు తరించి పోతున్న జంతుజాతులకు మానవుడు కారణం కాదా? కనీసం జంతువులకు ఉన్న ఈ త్యాగబుధి మరియు పరోపకార లక్షణం మనిషిలో ఉంటే చాలు ఒక మనిషి అనిపించుకోవటానికి,ఇస్లాము కూడా ఇదే విషయాన్ని భొదిస్తుంది,బ్రతుకు మరియు బ్రతకనివ్వు, కుదిరితే ఇతరులకు సహాయము చెయ్యి అనెవే ఇస్లాము బోధనల తాత్పర్యము.  
దివ్య ఖురానులో మీ ఆదాయంలో కొంతా భాగాన్ని ఆ దేవుని మార్గములో ఖరుపెట్టమని ఆ భగవంతుడు ఆదేశిస్తున్నాడు, దానిలోనూ మీ ఇష్టమైన  వస్తువులను ఆ దేవుని మార్గములో ఖర్చుచేయమని కూడా ఆదేశించటం జరిగింది.
“మీకు ప్రియాతిప్రియమైన వస్తువులను (ఆ దైవమార్గములో) ఖర్చుపెట్టనంతవరకూ మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు.మీరు ఖర్చుపెట్టేదంతా అల్లాహ్ కు తెలుసు”[ఆలి ఇమ్రాన్/92].
దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “దానగుణంకల వాడు ఆ అల్లాహ్ కు మరియు ప్రజలకు మరియు స్వర్గానికి దగ్గరగా ఉన్నవాడు”[అల్ కాఫీ,4వ భాగము,పేజీ నం:40].    

        

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15