.ఇమాం రిజా[అ.స]ల వారు ఈ లోకంలో గల అతి ఉత్తమ స్త్రీల యొక్క లక్షణాలను ఈ క్రింది వ్యాసంలో ప్రస్థావించారు.
ఇమాం రిజా[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: మీలో ఎవరైతే ఈ ఐదు లక్షణాలను కలిగి ఉంటారో వారే అత్యుత్తమ స్త్రీలు,అవి ఏవి అని ప్రశ్నించగా ఈ విధంగా సెలవిచ్చారు: అమీరుల్ మొమినీన్ అలి(అ.స) ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
1. ఏ మాటనైనా తేలికగా తీసుకుని దానిని కఠినంగా తీసుకొని స్త్రీ.( కఠినంగా వ్యవహరించని స్త్రీ).
2. ఉదారగుణం కలిగిన స్త్రీ మరియు కోపిష్టి కాని స్త్రీ(సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునే స్త్రీ).
3. తన భర్త ఆజ్ఞపాలన చేసే స్త్రీ(భర్త మాటకు కట్టుబడి ఉండే స్త్రీ).
4. ఎప్పుడైతే భర్త కోపానికి కారణమయ్యిందో అప్పుడు రెప్పపాటులో అతనిని రాజీ చేసుకునే స్త్రీ.
5. తన భర్త తన నుండి దూరంగా ఉన్నప్పుడు అతని మానమర్యాదలను మరియు అతని సంపత్తిని కాపాడే స్త్రీ.
రెఫరెన్స్: అల్ కాఫి,5వ భాగం,పేజీ నం:324.
వ్యాఖ్యానించండి