కష్టాలతో కృంగిపోవద్దు!

సోమ, 02/25/2019 - 21:04

కష్టాలు,సమస్యలనేవి ఈ లోకంలో సహజమే కానీ కష్టాలనేవి ఎల్లపుడూ ఉండవు మరియు పరిష్కారము లేని సమస్యలనేవి కూడా ఉండవు,కష్టాల తరువాత సుఖాలు కూడా వస్తాయి మరియు సమస్యలనేవి పరిష్కరింపబడతాయి. 

కష్టాలతో కృంగిపోవద్దు!

قال الامام الجواد علیه السلام: "مَن کَثُرَ هَمُّهُ سَقُمَ جَسَدُهُ"
అనువాదం: “ఎవరికైతే సోకాలు(బాధలు) ఎక్కువవుతాయో వారి శరీరం అనారోగ్యం పాలవుతుంది”[మౌసూఅతొ కలిమాతిల్ ఇమాం అల్ జవాద్,పేజీ నం:240]
ప్రాపంచిక జీవితంలో సుఖదుఖాలనేవి సహజమే,దైవప్రవక్తలు మరియు వారి ఉత్తరాధికారులకే కష్టాలు తప్పలేదు,ఆ దేవుడు ఈ కష్టాలను మనకే కలిగేలా ఎందుకు చేసాడు? అని ప్రశ్నించడం కూడా తప్పే,ఈ కష్టాలలో నిలదొక్కుకుని ముందుకి సాగిపోవడమే విశ్వాసుల సాఫల్య జీవితం యొక్క రహస్యం. ఇమాం(అ.స) ల వారి ఈ హదీసు అనుసారం అనారోగ్యాలకు మనము ప్రవర్తించే తీరు కూడా ఒక కారణము,చిన్నపాటి పొరపాట్లకు కోప్పడడం,నిరాశ చెందడం,జీవితంపై విరక్తి పుట్టడం ఇలాంటి పనులు నిజంగానే మనిషిని అనారోగ్యానికి గురిచేస్తాయి,ఈ మాటే ఈ రోజు సైన్సు ద్వారా కూడా నీరూపితమైంది,కోపం వల్ల మనిషి బక్కపల్చ కావడం మరియు నిరాశ కలతకు కారణం అనేవి వింటూనే ఉంటాము.
కష్టాలను తలుచుకుని కృంగిపోయేకన్నా ఆ దేవుని అనుగ్రహాలను తలుచుకుని అతనికి క్రుతజ్ఞులై ఉండటం,చీటికి మాటికి కొప్పడే దానికన్నా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగడం మరియు లేని దానితో నిరాశ చెందే కన్నా ఉన్నదానితో సంతృప్తి పడటం వల్ల కనీసం ఈ ప్రాపంచిక జీవితాన్ని సుఖశాంతులతో ముగించవచ్చు ఎందుకంటే కష్టాలనేవి సదా ఉండవు మరియు ఈ లోకంలో పరిష్కారము లేని సమస్యలు అనేవి కూడా ఉండవు(ప్రతీ సమస్యకు పరిష్కారము ఉంటుంది).             

               

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8