మానవుని యొక్క పరలోక జీవితాన్ని అతని కార్యాలే నిర్ణయిస్తాయి సత్కార్యాలు చేసే వారు స్వర్గానికి మరియు పాపాలు చేసే వారికి నరకానికి పంపబడతారు, ఇదే ఆ అల్లాహ్ యొక్క ధర్మము.
స్వర్గంలో అన్ని రకాల సౌఖ్యాలను అనుభవిస్తూ గడపాలని ప్రతీ ముస్లిము కొరుకుంటాడు కానీ పరలోకంలో ఎటువంటి జీవితాన్ని గడపబోతున్నాడు అనేది అతను చేసే కార్యాలపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు అతను చేసిన కార్యాల యొక్క పత్రం అతని ముందు హాజరు చేయబడుతుంది.
అల్లాహ్ దివ్యఖురానులో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “ఆ రోజు ప్రతీ వ్యక్తీ తాను చేసిన పుణ్యన్ని, తాను చేసిన పాపాన్ని తన ముందు చూసుకుంటాడు. తనకూ, తన పాపానికీ మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే!అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు”[ఆలి ఇమ్రాన్/30].
అతను స్వర్గానికి వెళతాడో లేక నరకంలోకి ప్రవేసిస్తాడో అనేది అతని కార్యాలు దానిని నిర్ణయిస్తాయి, ఎందుకంటే ప్రతీ చిన్న విషయం కర్మపత్రంలో రాయబడి ఉంటుంది, దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: కర్మపత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్ని, ఏ పెద్ద విషయాన్ని వదలకుండా నమోదు చేసిందే?! అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసిందంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు, నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు[అల్ కహఫ్/49].
వ్యాఖ్యలు
Jazakallah....
వ్యాఖ్యానించండి