.ఖుర్ఆన్ యొక్క మంచి సంఘటనగా పేరు పొందిన సంఘటన గల సూరహ్.
ఖుర్ఆన్ యొక్క పన్నెండవ సూరా ఇది. “యూసుఫ్” అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ఒక ప్రవక్త పేరు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 4 వ ఆయత్. ఈ సూరాలో “యూసుఫ్” అను పదం 25 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 27 సార్లు వచ్చింది. ఈ సూరాలో 111 ఆయత్‍లు, 1796 పదాలు మరియు 7305 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 44 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “హూద్” సూరా మరియు దీని తరువాత “హిజ్ర్” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు యూసుఫ్ అని పెట్టడానికి కారణం ఇందులో అల్లాహ్ ప్రవక్త “యూసుస్” సంఘటన ప్రస్తావించబడింది మరియు ఇందులోనే ప్రవక్త యూసుఫ్ యొక్క పేరు చాలా సార్లు వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న సంఘటనను గొప్పసంఘన అని చెప్పబడింది. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ప్రవచనానుసారం “ఎవరైతే ప్రతీ రాత్రి లేదా పగలు యూసుఫ్ సూరహ్ ను పఠిస్తాడో అల్లాహ్ ప్రళయం నాడు అతడిని యూసుఫ్ వలే మిక్కిలి అందాన్ని ప్రసాదిస్తాడు, అతనికి ఎటువంటి కష్టం ఉండదు మరియు అల్లాహ్ యొక్క మంచి దాసులలో లెక్కించబడతాడు”.
వ్యాఖ్యలు
Mashaallah
shukriya.... isi tarha apne comments k zariye himmat afzaaei farmate rahiye ...
Baqi suro'n k bare me bhi bataii ye agha.
ji zaroor bhai .. abtak 15 sooron k baare me mukhtasar taur pe site pe aa chuka hai .. inshallah jaldi hi baaqi bhi aajaayenge. InShaAllah.
Mashallah.....
Skhukriya... jazakallah
వ్యాఖ్యానించండి