దుఆ అంగీకరించబడే సమయాలు

సోమ, 03/04/2019 - 05:43

ప్రతీదానికి ఒక నిర్ణిత సమయం ఉన్నట్లే దుఆ చేస్తే తప్పకుండా అంగీకరించబే సమాయలు కూడా హదీసులలో వివరించబడి ఉన్నాయి.

దుఆ అంగీకరించబడే సమయాలు

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: ఈ సందర్భాలలో దుఆ అంగీకరించబడుతుంది: 1. గాలులు వీస్తున్న సమయంలో 2. జోహ్ర్ నమాజ్ సమయంలో 3. వర్షం కురుస్తున్నప్పుడు 4. షహీద్(అల్లాహ్ మార్గంలో ప్రాణత్యాగం చేసినవాడు) యొక్క మొదటి రక్తపుబొట్టు కారినప్పుడు ఎందుకంటే ఆ సమయంలో ఆకాశ ద్వారాలు తెలుచుకుంటాయి 5. విత్ర్ నమాజ్ లో 6. సుబ్హె సాదిఖ్ తరువాత 7. జోహ్ర తరువాత 8. మగ్రిబ్ తరువాత 9. ఖుర్ఆన్ చదివే సమయంలో 10. ఆౙాన్ పిలుపు సమయంలో 11. శుక్రవారం రోజు ఆరంభమయ్యే మరియు ముగిసే సమయాలలో 12. ఫజ్ర్ సమయానికి ఇంకా కొంచెం సమయం మిగిలి ఉన్నప్పుడు 13. షబె జుమా రాత్రంతా 14. ప్రతీ వాజిబ్ నమాజ్ అనంతరం 15. ఇషా నమాజ్ తరువాత సజ్దా చేసినప్పుడు 16. ఏడ్చినప్పుడు 17. జోహ్ర్ సమయానికి కొన్ని నిమిషాల ముందు 18. హరామ్ నెలలో దుఆ మరియు దుషణం అన్యాయుల పట్ల చాలా త్వరగా స్వీకరించబడుతాయి ముఖ్యంగా ౙీఖఅదహ్ మరియు రజబ్ మాసాలలో 19. షబె ఖద్ర్ రాత్రుళ్లలో ముఖ్యంగా 23వ రాత్రి 20. ఆ రాత్రికి సంబంధించిన పగలు 21. గదీర్, ఫిత్ర్ మరియు ఖుర్బాన్ పండగల రాత్రి మరియు పగలు 22. రజబ్ మాసం యొక్క మొదటి రాత్రి మరియు అలాగే రాత్రులన్నీ 23. నీమయే రజబ్ మరియు షాబాన్(15వ తారీఖు రాత్రీ మరియు పగలు) రాత్రి మరియు పగలు 23.పూర్తి రమజాన్ మాసం 25. అరఫారాత్రి మరియు పగలు 26. సూర్యాస్తమయ సమయంలో 27. ఫజ్ర్ సమయం నుండి సూర్యోదయం వరకు 28. ప్రతీరోజు అర్ధరాత్రి తరువాత మొదటి కొంత సమయం మరియు చివరి కొంత సమయంలో 29. సహర్ సమయంలో 30. ప్రతీరోజు ఉదయం మరియు సాయంత్ర సమయాలలో 31. ముస్తహబ్ నమాజుల తరువాత 32. ఇఫ్తార్ సమయంలో 33. షహీదుల సమాధుల వద్ద 34. ఉలమా మరియు సజ్జనుల సమాధుల వద్ద 35. తల్లిదండ్రుల సమాధుల వద్ద 36. ఏడారుల్లో 37. దుఆ సమయంలో ఆ దుఆకు అనుకూలమైన పేరుతో అల్లాహ్ ను పిలవడం ఉదాహారణకు “యా గఫ్ఫారు” క్షమాపణ కోసం 38. దైవప్రవక్త[స.అ] జన్మదినం రోజున 39. దైవప్రవక్త[స.అ] ప్రవక్తగా ఎన్నుకోబడిన రోజు యొక్క రాత్రి(షబే బేసత్, బేసత్ రజబ్ మాసం యొక్క 27వ తేదీ).[కిలీద్ హాయే రఫ్ఎ ముష్కిలాత్, పేజీ88]

రిఫ్రెన్స్
అలవీ కాషానీ, కిలీద్ హాయే రఫ్ఎ ముష్కిలాత్, అజ్ ఉసూలె కాఫీ, మర్హూమ్ కులైనీ, భాగం4, పేజీ 224.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9