సల్మానె ఫార్సీ ఎక్కడ జన్మించారు? మరియు ఎలా వారు మదీనహ్ చేరుకున్నారు? అన్న విషయాల పై సంక్షిప్త వివరణ.
దైవప్రవక్త[స.అ] అతిదగ్గర సహచరులలో ఒకరు “సల్మానె ఫార్సీ”. హిజ్రత్ కు చాలా సంవత్సరాల క్రితం ఇరాన్ దేశంలో ఉన్న "ఇస్ఫెహా"న్ కు చెందిన “జీ” అనే ఒక గ్రామంలో ఒక పిల్లాడు జన్మించాడు, అతడి పేరు “రూజ్ బెహ్”. దైవప్రవక్త[స.అ]తో కలిసిన తరువాత ప్రవక్త వారిని “సల్మాన్” అని నామకరించారు.
జనాబె సల్మాన్ తండ్రి "ౙర్దుష్తీయుల" ధర్మకర్త. అతను ఆ ధర్మంవారు విశ్వసించే నిప్పు గుండాన్ని నిరంతరం వెలుగుతూ ఉండేందుకు కట్టేలు వేసే పని చేసేవారు. జనాబె సల్మాన్ ౙర్దుష్తీయుల సమాజంలో జన్మించిప్పటికీ ఎప్పుడు కూడా నిప్పు ముందు ఆరాధ్యపరంగా తన తలను వంచలేదు అతను ఏకేశ్వరుని విశ్వసించేవారు. వారి చిన్నతనంలోనే తల్లి మరణించారు, వారి అత్త వారి పోషణబాధ్యతలు తీసుకున్నారు.
సల్మాన్ ను 6 నెలల పాటు కారాగారంలో ఉంచి ఆ తరువాత కూడా వారి పూర్వీకుల నమ్మకాలను అనుసరించకపోతే ఉరి తీయాలని నిర్ణయించబడింది, అన్న విషయాన్ని తెలుసుకున్న జనాబె సల్మాన్ వారి అత్త సహాయంతో తప్పించుకుని ఏడారుల వైపుకు వెళ్ళిపోయారు. ఏడారుల్లో షామ్ వైపుకు వెళ్తున్న ఒక బాటసారులగుంపుతో కలిసి తెలియని దేశాలకు ప్రయాణం సాగించారు. చివరికి అల్లాహ్ వారిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాడు. హిజ్రత్ యొక్క మొదట్లోనే దైవప్రవక్త[స.అ] చేతుల మీదుగా ఇస్లాంను స్వీకరించారు.[బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ366].
రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్.
వ్యాఖ్యలు
Masha allah
Jazakallah
వ్యాఖ్యానించండి