ఇస్లాము ధర్మము యొక్క ఆరు సూత్రాలు ఇమాం సాదిఖ్[అ.స]ల వారి దృస్టిలో.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఆ భగవంతునికి భయపడండి మరియు అతని ప్రవక్తపై విశ్వసించండి అన్నారు దానికి యూనుస్: మేము ఆ భగవంతునిపై మరియు అతని ప్రవక్తపై విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అని అన్నారు,దానికి ఇమాం[అ.స]ల వారు ఈ విధంగా జవాబిచ్చారు: మొహమ్మద్[స.అ]ల వారి యొక్క సరళమైన ధర్మములో కేవలం ఆరు విషయాలే ఉన్నాయి: నమాజు,జకాతు,రమజాను యొక్క ఉపవాసం,హజ్,తమ నాయకుని యొక్క ఆజ్ఞపాలన,విశ్వాసుల హక్కులను పూర్తి చేయటం.
ఎవరైతే ఇతర విశ్వాసుల హక్కులను పూర్తిచేయరో ప్రళయదినాన ఐదువందల సంవత్సరాల వరకు వారిని ఏ విధంగా నిలిపివేయటం జరుగుతుందంటే (అలసట వలన) వారి దేహాలనుంచి కారే చమటలు సెలయేళ్ళుగా ప్రవహిస్తాయి,అప్పుడు అల్లాహ్ తరపున నుండి ఈ విధంగా సంభోదించటం జరుగుతుంది: “ఈ అన్యాయపరుడు ఆ అల్లాహ్ హక్కులను పూర్తిచేయలేదు అందువలన వీడికి నలభై సంవత్సరాలు నిందించటం జరుగుతుంది ఆ తరువాత వీడిని నరకానికి పంపటం జరుగుతుంది”.
రెఫరెన్స్: అల్ఖిసాల్,షైఖ్ సదూఖ్,పేజీ నం:261.
వ్యాఖ్యలు
Mashallah .behtarin hadith
వ్యాఖ్యానించండి