జనాబె సల్మానె ఫార్సీ పేరు వారికి ఎవరు పెట్టారు? అందుకు కారణాలేమిటి? అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

ఇరాన్ దేశంలో జన్మించిన సల్మానె ఫార్సీ, వారి పూర్వీకుల విశ్వాసాలను నమ్మకపోతే ఉరి తీయబడతారు అని తెలిసుకొని వారి అత్త సహాయంతో అక్కడ నుండి తప్పించుకొని "షామ్"కు చెందిన ఒక బటసారుల గుంపుతో కలిసి తనకు తెలియని దేశం వైపుకు ప్రయాణం సాగించారు. హిజ్రత్ యొక్క ముందు రోజుల్లోనే వారు దైవప్రవక్త[స.అ]తో కలిశారు.
దైవప్రవక్త[స.అ] సల్మాన్ ను ఒక యూదుడి నుండి నలభై కర్జూరపు చెట్లు మరియు నలభై వఖియ(ప్రతీ వఖియహ్ నలభై దిర్హములకు సమానం అంటే 1600 వేల దిర్హములు) ఇచ్చి బానిసత్వం నుండి విముక్తిని ప్రసాదించి వారికి “సల్మాన్” అని ఒక మంచి పేరు పెట్టారు.[అల్ దరజాతుల్ రఫీఅహ్, పేజీ203]
పేరు మార్చడం రెండు విషయాలకు సూచన:
1. అజ్ఞానపు కాలం యొక్క పేర్లు ముస్లిములకు ఉచితమైనవి కావు.
2. సల్మాన్ అనే పదం సలామతీ మరియు తస్లీమ్ అనబడే పదాల నుండి తీసుకోబడినవి. దైవప్రవక్త[స.అ], వారికి సల్మాన్ అని పేరు పెట్టడం సల్మాన్ ఆత్మ యొక్క పవిత్రత మరియు సలామతీకి నిదర్శనం.
వ్యాఖ్యలు
Mashallah
వ్యాఖ్యానించండి