జనాబె సల్మాన్ దైవప్రవక్త[స.అ] మాటల్లో

మంగళ, 03/05/2019 - 18:02

సల్మానే ఫార్సీ గురించి మరియు వారి యొక్క వ్యక్తిత్వం గురించి దైవప్రవక్త[స.అ] హదీసుల ద్వార సంక్షిప్త వివరణ.

జనాబె సల్మాన్ దైవప్రవక్త[స.అ] మాటల్లో

సల్మానె ఫార్సీ, ఇస్లాం స్వీకరణ తరువాత ఈమాన్ మరియు ఇస్లాం ఎరుక మార్గంలో ఎంత ముందకు ‎సాగిపోయారంటే దైవప్రవక్త[స.అ] వద్ద గొప్ప స్థానం పొందారు మరియు పవిత్ర మాసూముల నుండి ప్రశంసలు ‎పొందారు. ఇప్పుడు సల్మానె ఫార్సీ గురించి వారు చెప్పిన కొన్ని హదీసులను చూద్దాం:
1. హిజ్రీ యొక్క 5వ సంవత్సరంలో సంభవించిన "ఖందఖ్" యుద్ధంలో సల్మాన్ యోచనతో పట్టణం చుట్టూ గొయ్యి ‎త్రవ్వారు. ప్రతీ ఒక్కరూ సల్మాన్ మా సమూహానికి చెందిన వారై ఉంటే బాగుండేది అని అనుకునే వారు అందుకే ‎ముహాజిరీనులు "సల్మాన్ మా నుండి" అంటే అన్సారులు "అతడు మా నుండి" అనేవారు. అప్పుడు దేవప్రవక్త[స.అ] ‎‎“సల్మాను మిన్నా అహ్లలల్ బైత్; సల్మాన్ మా అహ్లెబైత్ కు చెందినవాడు” అన్నారు.[మజ్ముఅల్ బయాన్, భాగం: 2 పేజీ:427.
2. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నిస్సందేహంగా సల్మాన్ స్వర్గాని చూడలనే అభిలాష కన్న స్వర్గానికి సల్మాన్ ను ‎చూడాలనే అభిలాష ఎక్కువ”[బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ341]
3. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “అల్లాహ్, ఈమాన్ కాంతితో ప్రకాశింపజేసిన హృదయం గల వ్యక్తిని ‎చూడాలనుకుంటున్నవారు, సల్మాన్ ను చూడండి”[ఎహ్తెజాజె తబర్సీ, భాగం1, పేజీ150]
4. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “సల్మాన్ నావాడు, వారిని హింసిచినవారు నన్ను హింసించినట్లే, వారిని బాధ పెట్టిన ‎వారు నన్ను బాధపెట్టినట్లే.[అఅయానుష్షియా, భాగం7, పేజీ287].‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16