జనాబె సల్మాన్ జ్ఞానం

గురు, 03/07/2019 - 04:53

జనాబె సల్మాన్ జ్ఞానం గురించి సూచిస్తున్న కొన్ని హదీసుల తెలుగు అనువాదం.

జనాబె సల్మాన్ జ్ఞానం

జనాబె సల్మాన్ జ్ఞానాన్ని సూచిస్తున్న కొన్ని హదీసులు మీ కోసం:
1. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఒకవేళ ధర్మం(దీన్) సురయ్యా(కృత్తికానక్షత్రము)లో ఉన్నా సల్మాన్ దానిని చేరుకుంటారు”[షర్హె నెహ్జుల్ బలాగహ్, ఇబ్నె అబిల్ హదీద్, భాగం18, పేజీ36]
2. ఇమామ్ జాఫరె సాదిఖ్[స.అ] ఉల్లేఖనం: “దైవప్రవక్త[స.అ] మరియు హజ్రత్ అలీ[అ.స], వీరిద్దరూ ఇతరులు విని సహించుకులేనటువంటి రహస్యాలను సల్మాన్ కు చెప్పేవారు. వారిని జ్ఞాననిధి మరియు రహస్యాలను కాపాడేవారుగా భావించేవారు; అందుకే ఒక విధంగా సల్మాన్ బిరుదు “ముహద్దిస్” కూడానూ.[బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ47]
3. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: “ఇస్లాంలో, ప్రజలందరిలో ధర్మశాస్త్రజ్ఞుడైన వ్యక్తి, సల్మాన్ మాధిరి సృష్టించబడలేదు”[తన్ఖీహుల్ మిఖాల్, భాగం2, పేజీ47]
4. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “సల్మాన్, ఎవరూ చేరలేనటువంటి లోతైన జ్ఞాన సముద్రం”[ఎఖ్తెసాస్, షేఖ్ ముఫీద్, పేజీ222]
5. సల్మాన్ ఇలా చెప్పేవారు: “ప్రజలారా! నాకు తెలిసిన విషయాలు మీకు చెబితే, మీరు సల్మాన్ కు పిచ్చిపట్టింది అంటారు, లేదా సల్మాన్ ను చంపినవారిపై దురూద్ పంపుతారు”[రిజాలె కషీ, పేజీ20]

రిఫ్రెన్స్
షర్హె నెహ్జుల్ బలాగహ్, ఇబ్నె అబిల్ హదీద్. బిహారుల్ అన్వార్. తన్ఖీహుల్ మిఖాల్. ఎఖ్తెసాస్, షేఖ్ ముఫీద్. రిజాలె కషీ.

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16