.ఖుర్ఆన్ యొక్క పదమూడవ సూరహ్ అయిన రఅద్ గురించి సంక్షిప్త వివరణ.
ఖుర్ఆన్ యొక్క పదమూడవ సూరా ఇది. “రఅద్” అనగ ఉరుము. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 13 వ ఆయత్. ఈ సూరాలో “రఅద్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 2 సార్లు వచ్చింది. ఈ సూరాలో 43 ఆయత్‍లు, 854 పదాలు మరియు 3541 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 34 సార్లు వచ్చింది. ఈ సూరా మదీనలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ముహమ్మద్” సూరా మరియు దీని తరువాత “రహ్మాన్” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు రఅద్ అని పెట్టడానికి కారణం ఇందులో ఆకశం యొక్క ఉరుముల ప్రస్తావన ఉంది. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ప్రవచనానుసారం “ఎవరు ఎంత ఎక్కువగా రఅద్ సూరహ్ ను చదువుతారో వారు ఆకాశపు ఉరుముల నుండి సురక్షితంగా ఉంటాడు. విశ్వాసి అయితే లెక్క లేకుండానే స్వర్గంలో ప్రశిస్తాడు మరియు తన కుటుంబీకుల నుండి ఎవరిని పడితే వారి సిఫారసు చేయగలడు”.
వ్యాఖ్యానించండి