నమాజ్, జకాత్ మరియు జిహాద్ ను వివరిస్తున్న ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] హదీస్ వివరణ.
ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా ఇతర ఆరాధనల, స్మరణల మరియు ప్రార్ధనలతో పోల్చితే నమాజ్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రత్యేకతా వేరేగా ఉంటుంది. నిజానికి ఇస్లాం యొక్క ప్రతీ చర్య; స్మరణల నుండి ప్రార్ధనల వరకు అన్నీంటికి ఏదో ఒక కారణం ఉంటుంది అలాగే ప్రతీ ప్రార్దనకు ఒక స్థానం ఉంటుంది. అలాంటి విషయాలను వివరిస్తున్న ఒక హదీస్ ను ఇక్కడ చూద్దాం.
హదీస్: సులైమాన్ ఇబ్నె ఖాలిద్ ఉల్లేఖన ప్రకారం ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] నాతో ఇలా అన్నారు: “ఇస్లాంలో ఏది మూలమైనదీ, ఏది విభాగం మరియు ఏది ఇస్లాం యొక్క అగ్ర స్థానం అన్న విషయాలు నీకు తెలుసుకోవలని లేదా?. నేను “నా ప్రాణం మీపై ఫిదా! తప్పకుండా తెలియపరచండి” అని అన్నాను. ఇమామ్ “నమాజ్ ఇస్లాం ధర్మం యొక్క మూలం, ౙకాత్ దాని యొక్క విభాగం మరియు అల్లాహ్ మార్గంలో జిహాద్ దాని యొక్క అగ్ర స్థానం”[అల్ కాఫీ, భాగం2, పేజీ23]
రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, అల్ కాఫీ.
వ్యాఖ్యానించండి