నమాజ్ ఇస్లాం యొక్క చిహ్నం, దైవప్రవక్త[స.అ] కనుల కాంతి మరియు స్వర్గం యొక్క తాళం చెవి అని సూచిస్తున్న మూడు హదీసుల వివరణ.
ఖుర్ఆన్ మరియు హదీసులు నమాజ్ యొక్క ప్రాముఖ్య మరియు దాని విలువను వివరించిన సంధర్భాలు చాలా ఉన్నాయి. ఈ రెండూ ఇస్లాం ధర్మం యొక్క మూలాధారాలు. హదీస్ గ్రంథాలను పరిశీలించినట్లైతే నమాజ్ ప్రాముఖ్యతను వివరిస్తున్న చాలా హదీసులు కనబడతాయి. వాటి నుండి ఇక్కడ మూడు హదీసులు మీ కోసం:
1. నమాజ్ ఇస్లాం ధర్మం యొక్క ముఖం: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ప్రతీ దానికి ఒక ముఖం ఉంటుంది మరియు నమాజ్ మీ దీన్ యొక్క ముఖం”[తహ్జీబుల్ అహ్కామ్, భాగం2, పేజీ238] అనగా మనిషిని అతని ముఖం చూసి ఎలా గుర్తుపడతారో నమాజ్ కూడా ఇస్లాం యొక్క సూచన మరియు గుర్తు వంటిది అని అర్థం.
2. నమాజ్ దైవప్రవక్త కనుల వెలుగు: దైవప్రవక్త[స.అ] అబూౙను ఇలా బోధించారు: “ఓ అబూౙర్! అల్లాహ్ నా కనుల కాంతిని నమాజ్ లో పెట్టాడు. ఆకలితో ఉన్నవాడికి ఆహారంపై ఎంత ప్రేమ ఉంటుందో అదే విధంగా నమాజ్ పై నాకు అంత ప్రేమ ఉంది, కాని తేడా ఏమిటంటే ఆకలితో ఉన్నవాడికి ఆహారం తిన్న తరువాత ఆకలి తీరిపోతుంది కాని ఎన్నడూ నాకు నమాజ్ ఇక చాలు అనిపించదు”[మకారిముల్ అఖ్లాఖ్, భాగం3, పేజీ266]
3. నమాజ్ స్వర్గపు తాళం చెవి: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: దుఆ కారుణ్యానికి తాళం చెవి, ఉజూ నమాజ్ కొరకు తాళం చెవి మరియు నమాజ్ స్వర్గానికి తాళం చెవి.[నెహ్జుల్ ఫసాహత్, హదీస్1588, పేజీ331]
వ్యాఖ్యలు
Subhanllah
వ్యాఖ్యానించండి