ఇబ్రాహీమ్ సూరహ్

బుధ, 11/08/2017 - 05:02

.ఖుర్ఆన్ యొక్క ఈ సూరహ్ లను చదివితే ఎప్పటికి పేదరికం, పిచ్చి మరియు కష్టాలు రావు.

ఇబ్రాహీమ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క పద్నాల్గొవ సూరా ఇది. “ఇబ్రాహీమ్” అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ఒక ప్రముఖ ప్రవక్త పేరు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 35 వ ఆయత్. ఈ సూరాలో “ఇబ్రాహీమ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 69 సార్లు వచ్చింది. ఈ సూరాలో 52 ఆయత్‍లు, 830 పదాలు మరియు 3541 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 37 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “నూహ్” సూరా మరియు దీని తరువాత “అంబియా” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు ఇబ్రాహీమ్ అని పెట్టడానికి కారణం ఇందులో అల్లాహ్ ప్రముఖ ప్రవక్త “ఇబ్రాహీమ్” సంఘటన ప్రస్తావించబడి ఉంది. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ప్రవచనానుసారం “ఎవరైతే ప్రతీ శుక్రవారం రెండు రక్అత్ లలో ఇబ్రహీమ్ సూరా మరియు హిజ్ర్ సూరాలను పఠిస్తారో వారికి ఎప్పటికి పేదరికం, పిచ్చి మరియు కష్టాలు రావు”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7