హజ్రత్ అలీ[అ.స] మరియు ఒక వ్యాపారి

సోమ, 03/18/2019 - 11:23

హజ్రత్ అలీ[అ.స] ఖిలాఫత్ అధికార కాలంలో జరిగిన ఒక సంఘటన.

హజ్రత్ అలీ[అ.స] మరియు దుకాణం యజమాని

ఇమామ్ అలీ[అ.స] వ్యాపారస్తులనూ పరిశీలించడానికై బజారుకు వెళ్తూ ఉండేవారు మరియు వారికి సద్భోదిస్తూ ఉండేవారు. ఒకరోజు ఇమామ్ కర్జూర పండ్లు అమ్మేవారి బజారుకు వెళ్ళారు, అక్కడ ఒక పాపను ఏడుస్తుండగా చూసి ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. ఆ పాప “నా యజమాని నాకు ఒక దిర్హమ్ ఇచ్చి బజారుకు వెళ్ళి కర్జూరం తీసుకురమ్మని అన్నాడు” నేను ఈ దుకాణం నుండి కర్జూరాలు కొని ఇంటికి తీసుకొని వెళ్ళాను, అవి మా యజమానికి నచ్చలేదు, వాటిని తిరిగి ఇచ్చి నా డబ్బులు తీసుకుందామని వచ్చాను.
ఇమామ్ ఆ దుకాణం యజమానితో ఇలా అన్నారు: ఈ పాప చిన్నపాప, ఒకరి బానిస, నిర్ణయం తీసుకునే స్వచ్ఛలేనిది, ఈ కర్జూర పండ్లు తీసుకొని డబ్బును తిరిగి ఇచ్చేయి. ఆ దుకాణం యజమాని నిలబడి ఇమామ్ అలీ[అ.స] గుండెల మీద చేయి పెట్టి దుకాణం నుండి క్రిందికి దింపేయాలిని అనుకున్నాడు.
ఈ సంఘటనను చూస్తున్నవారు ఆ యజమానితో “ఇతను అలీ ఇబ్నె అబీతాలిబ్” అని అన్నారు. అంతే దుకాణం యజమని ముఖం పచ్చబడింది. వెంటనే ఆ పాపనుండి కర్జూరపు పండ్లు తీసుకొని డబ్బులు తిరిగి ఇచ్చి ఇమామ్ అలీ[అ.స]తో “స్వామీ మీరు నా పట్ల సమ్మతాభావం కలిగే ఉండండి మరియు నా తప్పును మన్నించండి” అని కోరాడు.  
అప్పుడు ఇమామ్ అలీ[అ.స] ఇలా అన్నారు: “నాకు సమ్మతాభావం కలగాలంటే ఒకే మార్గం ఉంది, అది నువ్వు నీ ఈ స్వభావాన్ని మార్చుకొని మంచి రీతిని సొంతం చేసుకోవడం”[బిహారుల్ అన్వార్, భాగం9, పేజీ519]

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8