అబూ అయ్యూబె అన్సారీ

సోమ, 03/18/2019 - 11:49

అబూ అయ్యూబె అన్సారీ ఎవరూ వారికీ మరియు దైవప్రవక్త[స.అ]కు గల సంబంధం ఏమిటి అన్న విషయంపై సంక్షిప్త వివరణ.

అబూ అయ్యూబె అన్సారీ

అబూఅయ్యూబె అన్సారీ, దైవప్రవక్త[స.అ] గొప్ప సహచరులలో ఒకరు. దైవప్రవక్త[స.అ] అల్లాహ్ ఆదేశానుసారం మక్కా నుంచి హిజ్రత్ చేసి మదీనహ్ కు వచ్చినప్పుడు, మదీనహ్ లో ఉన్న అన్ని సమూహాలకు చెందినవారూ ప్రవక్తను తమ ఇంట్లో ఉండమని కోరారు. దైవప్రవక్త[స.అ] “ఎక్కడైతే నా ఈ ఒంటె కూర్చుంటుందో ఆ ప్రదేశాన్ని నేను ఎంచుకుంటాను” అని అన్నారు.
దైవప్రవక్త[స.అ] ఒంటె “బనీ మాలిక్ ఇబ్నె నజ్జార్” అనబడే బస్తీ ఇళ్ళ వద్దకు వచ్చి కూర్చుంది, మరలా ఒంటె లేచి తిరిగీ తిరగీ అదే ప్రదేశంలో వచ్చి కూర్చుంది. అందరూ దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చారు. ఆ బస్తీకి చెందిన ప్రతీ ఒక్కరు దైవప్రవక్త[స.అ] వారిట్లో ఉండాలని అభిలాష పడ్డారు. హజ్రత్ అబూ అయ్యూబె అన్సారీ ముందుకొచ్చి ఆ ఒంటె పైనుండి సామానులు దించి తన ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. దైవప్రవక్త[స.అ] నా సామానులు ఎక్కడా? అని అక్కడున్నవారితో అడిగితే “అబూఅయ్యూబే అన్సారీ వాటిని తనతో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్ళారు” అని సమాధానమిచ్చారు. దైవప్రవక్త[స.అ] “మనిషి తన సామనులతో పాటు ఉండడం మంచిది” అని చెప్పి అబూఅయ్యూబె అన్సారీ ఇంటికి వెళ్ళారు. మస్జిదే నబవీలో ఇళ్ళ నిర్మాణం అవ్వనంత వరకు వారు[స.అ] అబూ అయ్యూబె అన్సారీ ఇంట్లోనే ఉన్నారు. అబూఅయ్యూబె అన్సారీ ఇల్లు రెండస్తులు అందులో క్రింద దైవప్రవక్త[స.అ] ఉండేవారు. తర్వాత అబూఅయ్యూబ్ వచ్చి దైవప్రవక్త[స.అ]తో “నాకు బాగనిపించడంలేదు, మీరు పైఅంతస్తులో ఉండండి నేను క్రింద ఉంటాను” అని అన్నారు. దైవప్రవక్త[స.అ] అతని కోరికను మన్నించి పైఅంతస్తుకు వెళ్ళిపోయారు.
అబూఅయ్యూబె అన్సారి బద్ర్, ఒహద్ మరియు ఇతర ఎన్నో యుద్ధాలలో దైవప్రవక్త[స.అ]తో పాటు పాల్గొన్నారు. ఖైబర్ యుద్ధం గెలిచిన తరువాత హజ్రత్ అబూ అయ్యూబ్ దైవప్రవక్త[స.అ] యొక్క డేర బయట కావలి బాధ్యతను నిర్వర్తించారు. ఉదయాన్నే దైవప్రవక్త[స.అ] “డేరా బయట ఎవరున్నారూ?” అని అడిగారు. నేనే స్వామి అబూఅయ్యూబ్నీ, అన్నారు. దైవప్రవక్త[స.అ] రెండు సార్లు “అల్లాహ్ ఇతని పై తన కారుణ్యం కురిపించుగాక!” అని అన్నారు.
నిస్సందేహంగా ఇది వారు ఇస్లాం మరియు దైవప్రవక్త[స.అ] పట్ల విధేయత చూపినందుకు ప్రవక్త దుఆ వారికి దక్కింది.[బిహారుల్ అన్వార్, భాగం1, పేజీ554].

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15