ఇతరులను గౌరవించండి

బుధ, 03/20/2019 - 12:28

ఇతరులను గౌరవించడం సాటి మనిషిగా మన కర్తవ్యం మరియు మానవత్వపు లక్షణం అదే లేకపోతే మనిషి అన్న దానికి అర్ధం ఉండదు. 

ఇతరులను గౌరవించండి

ఈ లోకంలో నివసించే ప్రతీ మానవునికి తన సమాజంలో కొద్దిపాటి గౌరవం మరియు ప్రతిష్ట ఉంటుంది దానిని అతని నుండి లాక్కొన్నే హక్కు ఎవరికీ లేదు,ఒక వేళ ఇతరులను గౌరవించే స్వభావం మన దగ్గర లేక పోతే అతనిని అవమానించి అప్రతిష్ట పాలు చేసే హక్కు కూడా మనకు లేదు.సాటి మానవుని గౌరవించని వాడికి ఇతరుల నుండి తనకు గౌరవం లభించాలని ఆశించటం కూడా తప్పే. ఇదే విషయాన్ని ఇస్లాము కూడా తాకీదు చేస్తూ ముస్లిముపై సాటి ముస్లిముకు గల హక్కులను సైతం ప్రస్థావిస్తుంది.
విశ్వాసులు అన్నదమ్ములు:దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:“విశ్వాసులు(ముస్లిములు) అన్నదమ్ములు(అన్న సంగతి మరువకండి).కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్ధుబాటుకు ప్రయత్నించండి.అల్లాహ్ కు భయపడుతూ ఉండండి,తద్వారా మీరు కరుణించబడవచ్చు”[అల్ హుజురాత్/10].
ఉత్తమ రీతిలో ప్రవర్తించండి:ఇతర విశ్వాసులతో ప్రవర్తించే తీరును ప్రస్థావిస్తూ దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది:“ఎవరైనా మీకు సలాము చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమరీతిలో జవాబు ఇవ్వండి.లేదా కనీసం అదే విధంగా నైనా చెప్పండి.నిస్చయంగా అల్లాహ్ ప్రతీ దానికి లెక్క తీసుకుంటాడు”[అన్ నిసా/86].
ఇతరులకు న్యాయం మరియు ఉపకారం చేయండి:కేవలం విశ్వాసులు మరియు ముస్లిములతోనే కాదు అవిస్వాసులు మరియు దురాచారులతో కూడా న్యాయం మరియు ఉపకార స్వభావంతో మలుచుకోవాలని ఇస్లాం ఆదేశిస్తుంది:“అల్లాహ్ న్యాయం చేయమని మరియు ఉపకారం(ఎహ్సాన్) చేయమని,బంధువుల హక్కులను నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు”[అన్ నహ్ల్/90].  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19