ప్రాయశ్చితానికి ఆరు షరతులు!

ఆది, 03/24/2019 - 08:06

ప్రాయశ్చితానికి గల షరతుల వివరణ ఇమాం అలి(అ.స)ల వారి హదీసు అనుసారంగా.

ప్రాయశ్చితానికి ఆరు షరతులు!

ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ప్రాయశ్చితానికి ఆరు షరతులు ఉన్నాయి:
1.ప్రాయశ్చితం మరియు చేసిన కార్యాలపై(పాపాలపై) చింతన.
2.మరలా ఆ పాపాల జోలికి పోనని దృఢమైన సంకల్పన.
3.తనపై గల ఇతరుల హక్కులను పూర్తి చేయటం.
4.ఏ హక్కులైతే ఆ భగవంతుని తరపునుండి తనపై విధిగా చేయబడ్డయో మరియు ఏ హక్కులైతే తాను వదిలిపెట్టాడో(నిర్లక్ష్యం వలన) వాటిని పూర్తి చేయటం.
5.తన దేహంలో ఏ మాంసమైతే హరాము తినటం వలన వచ్చిందో దానిని ఆకలి మరియు ప్రాయశ్చితం మరియు ఏడ్పు (తన పాపాలకు ప్రాయశ్చితంగా ఎడ్వడం) ద్వారా దానిని కరిగించి తద్వారా మరల ఆ ఎముకలపై తాజా మాంసం వచ్చేటట్లు చేయటం.
6. ఏ విధంగా నైతే పాపాల యొక్క స్వాదాన్ని తన దేహానికి అలవాటు చేసాడో అదే విధంగా ప్రార్ధనల యొక్క కష్టాన్ని కూడా దేహానికి అలవాటు చేయటం.

రెఫరెన్స్:వసాయెలుష్ షియా,11వ భాగం,పేజీ నం:361.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9