తల్లి కోపం కొడుకు మరణానికి కష్టం

మంగళ, 03/26/2019 - 06:43

తల్లి కోపం కొడుకు ఆత్మ గాలిలో కలిసిపోవడానికి అడ్డుగా నిలబతుంది అని చెప్పే ఒక సంఘటన.

తల్లి కోపం కొడుకు మరణానికి కష్టం

ఒక వ్యక్తి మంచాన్నపడి చివరి గడియాలు లెక్కపెడుతున్నాడు, మృత్యువును ఎదురు చూస్తున్నాడు. దైవప్రవక్త[స.అ] అతడి వద్దకు వచ్చారు, మరణ సమయం దగ్గర పడినా అతడి ప్రాణాలు పోవడం లేదు. దైవప్రవక్త[స.అ] అతడిని పిలిచారు, అతడు సమాధానమిచ్చాడు, అప్పుడు దైవప్రవక్త[స.అ] “ఇప్పుడు నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు. అతడు “యా రసూలల్లాహ్! ఇప్పుడు నా ముందు భయంకరమైన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు” అన్నాడు. దైవప్రవక్త[స.అ] “ఈ యువకుడి తల్లి బ్రతికే ఉందా?” అని అడిగారు. అక్కడున్నవారు “ఔను బ్రతికే ఉంది” అని అన్నారు. “ఆమెను తీసుకొని రండి” అని ఆజ్ఞాపించారు. ఆమె వచ్చిన తరువాత దైవప్రవక్త[స.అ] ఆమెతో “అమ్మా! నువ్వు నీ కొడుకు పై కొపంగా ఉన్నావా? ఒకవేళ నిరాశగా ఉండి ఉంటే అతడిని క్షమించు” అని అన్నారు. ఆ వృద్ధ తల్లి “యా రసూలల్లాహ్! నిజంగానే నేను ఇతడి పట్ల నిరాశ చెంది ఉన్నాను, మీరు చెబుతున్నారు కాబట్టి నేను వీడిని క్షమిస్తున్నాను” అని అంది.
అప్పుడు ఆ యువకుడు స్పృహ తప్పిపోయాడు, అతడికి మెలుకువ రాగానే వారు[స.అ] అతడికి మరలా పిలిచి ఇప్పుడు “నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు.
ఆ యువకుడు “యా రసూలల్లాహ్! ఆ నలుపు ముఖాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు దయతో, కారుణ్యంతో కూడి ఉన్న ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. వారిని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నాడు.
ఆ తరువాత అతడి ఆత్మ గాలిలో కలిసిపోయింది.[అమాలీయె షేఖ్ తూసీ, భాగం1, పేజీ63]  

రిఫ్రెన్స్
సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, ఇతాఅతే వాలిదైన్ అధ్యాయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9