ముస్లిముల వెనుకుబాటుతనానికి కారణం ఇస్లామా?

బుధ, 03/27/2019 - 11:50

ఇస్లాము ఎప్పటికి వెనుకుబాటుతనానికి కారణం కాదు,ఇది కేవలం దురహంకారంతో ఉన్న పశ్చిమదేశాలు ఇస్లామును మరియు ముస్లిములను తప్పుబట్టటానికి వారు చేసిన తప్పుడు వ్యాఖ్యలు మాత్రమే.   

ముస్లిముల వెనుకుబాటుతనానికి  కారణం ఇస్లామా?

అవిస్వాసుల ఉన్నతికి కారణం ఆ దేవుని పట్ల అతని ధర్మము పట్ల వారు ప్రవర్తించే అవిశ్వాస వైఖరా?వారి ఉన్నతికి మరియు ముస్లిముల వెనుకుబాటుతనానికి నిజమైన కారణాలు ఏంటి?ఈ ప్రశ్న ఒక రకంగా తప్పే వీరి వెనుకుబాటు తనానికి ఇస్లాము కారణము కాదు,ఇస్లాము చరిత్రపై దాని నాగరికతపై కొద్దిపాటి అవగాహన ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే,వెయ్యి సంవత్సరాల క్రితం సైన్స్,జ్ఞానం మరియు సాంకేతిక రంగాలలో ఇస్లామీయ నాగరికత చాలా గొప్పది.ఈ సుదీర్ఘకాలంలో బూ అలి సీనా,జాబిర్ బిన్ హయ్యాన్,జకరియా రాజీ మరియు ఇబ్నె హైసం లాంటి వారి కృషి మరచిపోలేనిది. ఆ కాలంలో సైన్స్,జ్ఞానం,సాంకేతిక రంగాలలో ముస్లిములు ఉన్నతశిఖరాలను అధిరోహించటానికి ఇస్లాము కారణము కాదా?మాంచెష్టర్ యూనివర్సిటి లో ప్రొఫెసర్ అయిన సలీం అల్ హుసైని తాను చేసిన పరిశోధన ఫలితంగా వ్రాసిన వ్యాసంలో 600 నుండి 1600 సంవత్సరాల మధ్యకాలంలో ఇస్లాముపండితులుఖగొళశాస్త్రం,బీజగణితం,సంఖ్యాసిధ్ధాంతం,త్రికొణమితి,భౌతికశాస్త్రం,భూగొళశాస్త్రం,రసాయనశాస్త్రం,ఫార్మసి,ఇంజనీరింగ్,కళ మరియు సాహిత్యం వంటి రంగాలలో వారు చేసిన కృషి అవి స్పెయిన్ నుండి చైనా వరకు వ్యాపించటానికి కారణమైంది అని అన్నారు.ఆశక్తికరంగా పాశ్చాత్య విద్వాంసులు గౌరవించబడటానికి కారణమైన ఎన్నో అవిష్కరణలు అనేక సంవత్సరాల క్రితం ముస్లిము పండితులచే కనుగొనబడ్డాయి.అదేవిధంగా ఈ పశ్చిమ దేశాలకు చెందిన శాస్త్రవేత్తల అవిష్కరణలకు కారణం వారి అవిష్కరణల వెనుక దాగివున్న అనేక విధ్యలు ఈ ముస్లిము పండితుల ద్వారానే కనుగొనబడ్డాయి.అదేవిధంగా ఈ పశ్చిమ దేశాల పండితులు ఈ ఆవిష్కరణలను తమ పేర లిఖించి చరిత్రలో అతి పెద్ద శాస్త్రీయ దొంగతనానికి పాల్పడ్డారని చెప్పవచ్చు.

రెఫరెన్స్:1001inventions.com  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15