నిజమైన పేదవాడు

ఆది, 03/31/2019 - 03:34

నిజమైన ఫఖీరు మరియు పేదవాడు ఎవరూ అన్న విషయం పై ఇచ్చిన దైవప్రవక్త[స.అ] వివరణ.

నిజమైన పేదవాడు

ఒకరోజు దైవప్రవక్త[స.అ] ఒక సంఘటన తరువాత మస్జిదులో ఉన్న జనాన్ని ఉద్దేశించి గట్టిగా ఇలా ప్రశ్నించారు: “ఫఖీర్(లేనివాడు, బీదవాడు) ఎవరో, మీలో ఎవరికి తెలుసు?”
మస్జిదులో కుర్చొని ఉన్నవాళ్ళలో గుసగుసలు మొదలయ్యాయి, ఒకొక్కరు ఒక్కో సమాధానమిచ్చారు. చివరికి ఒక వ్యక్తి బిగ్గరగా ఇలా అన్నాడు: “డబ్బు లేనివాడు, చేతిలో ప్రాపంచిక ధనం లేనివాడిని ఫఖీర్ అంటారు”
అక్కడున్న మిగతావారు కూడా తమ తలలను ఊపి అతడి మాట పై సమ్మతాభావాన్ని వ్యక్తం చేశారు.
దైవప్రవక్త[అ.స] ఇలా అన్నారు: కాదు. మీరు చెప్పినవాడు నిజమైన పేదవాడు కాదు. ప్రళయదినాన మహ్షర్ లో ప్రవేశించినప్పుడు ఇతరుల హక్కులు వాడిపై మిగిలి ఉండిపోయిన వ్యక్తి అసలైన పేదవాడు; అనగా ఎవరినో దూషించాడు, లేదా అతడి సొమ్ములు అన్యాయంగా తినేశాడు, లేదా ఎవరినో అన్యాయంగా చంపేశాడు, లేదా ఎవరినో అన్యాయంగా కొట్టాడు. ఇలాంటి వ్యక్తి ఖాతాలో అతడు చేసుకున్న మంచి చర్యల పుణ్యం గనక ఉంటే అతడు చేసిన అన్యాయాలకు బదులుగ ఆ పుణ్యాన్ని అతడి నుండి తీసుకొని బాధితులకు ఇవ్వబడుతుంది. ఒకవేళ అతడి ఖాతాలో ఉన్న పుణ్యం సరిపోకపోతే, బాధితుల పాపాలను తీసి అతడి ఖాతాలో లిఖిస్తారు, దాంతో అతడు నరకానికి పంపబడతాడు. ఇలాంటి వాడే నిజమైన పేదవాడు.[దాస్తాన్ హాయే బిహారుల్ అన్వార్, భాగం6, పేజీ41].

రిఫ్రెన్స్
మహ్మూద్ నాసిరీ, దాస్తాన్ హాయె బిహారుల్ అన్వార్.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9