.దైవప్రవక్త[స.అ] మనవడు ఇమామ్ హసన్[అ.స] కాలినడకతో హజ్ యాత్రకు వెళ్లెవారు. ఇలా ఒకటీరెండు సార్లు కాదు ఎన్నోసార్లు వెళ్ళారు.
![ఇమామ్ హసన్[అ.స] ప్రతిష్టత ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] మాటల్లో](https://te.btid.org/sites/default/files/field/image/sgry02.jpg)
ఇమామ్ సాదిఖ్[అ.స], ఇమామ్ హసన్[అ.స] యొక్క కొన్ని ప్రతిష్టతల వివరణలో ఇలా ప్రవచించారు:
"...أن الحسن بن علي بن أبي طالب (عليه السلام) كان أعبد الناس في زمانه، وأزهدهم وأفضلهم، و"
అనువాదం: నిస్సందేహముగా అలీ ఇబ్నె అలీతాలిబ్[అ.స] కుమారుడు హసన్[అ.స] తమ కాలంలో అందరికన్న ఎక్కువగా భక్తిప్రార్థనలు చేసేవారు, ధర్మనిష్ఠగలవారు మరియు ఉత్తములు. మరియు వారు హజ్ చేయడం కోసం కాలినడకతో వెళ్ళేవారు, అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడిచేవారు. ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరిస్తూ ఉండేవారు. ప్రతీ పని అల్లాహ్ కోసమే చేసేవారు. వారు అల్లాహ్ గ్రంథంలో "يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا" (ఓ విశ్వాసులారా!) అని చదివినప్పుడల్లా ఇలా అనే వారు.. "لبّيك اللّهم لبّيك" (లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్)[అమాలీయే షేఖ్ సదూఖ్, భాగం1, పేజీ244].
రిఫ్రెన్స్
అమాలీ, షేఖ్ సదూఖ్, తహ్ఖీకు ఖిస్మి అల్ దిరాసాత్ అల్ ఇస్లామియహ్, ముఅస్ససతుల్ బెఅసహ్.
వ్యాఖ్యానించండి