అల్లాహ్ వాహిద్(ఒక్కడు) యొక్క అర్ధమేమిటి? అన్న ప్రశ్నకు ఇమామ్ ఇచ్చిన వివరణ.

జమల్ యుద్దం సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఇమామ్ అలీ[అ.స]తో అల్లాహ్ యొక్క తౌహీద్ గురించి ఇలా ప్రశ్నించాడు: “అల్లాహ్ వాహిద్(ఒక్కడు) యొక్క అర్ధమేమిటి?”.
దానికి ఇమామ్ సమాధానం ఇలా ఇచ్చారు: “వాహిద్ కు నాలుగు అర్థాలున్నాయి: వాటిలో రెండర్థాలు సరైనవి కావు మరో రెండర్థాలు సరైనవి. ఆ సరైనవి కాని అర్థాలు ఇవి;
1. అల్లాహ్ వాహిద్ అనగా అల్లాహ్ మొదటి వాడు(అంటే సున్నా మరియు రెండుకు ప్రతిగా ఉన్న సంఖ్య అని అర్థం) అని అనడం. లేదా
2. ఒక జాతికి చెందినవారి నుండి ఒకరు అనడం; ఉదాహారణకు జైద్ అన్న వ్యక్తి మానవ జాతి నుండి ఒకడు.
* తౌహీద్ కు మిగిలిన సరైన రెండు అర్థాలు;
3. అల్లాహ్ పరపూర్ణత్వాలన్నీటిలో ఒక్కడు అనగా సాటిలేనివాడు అని భావించడం. లేదా
4. అల్లాహ్ ను విభజించడం సాధ్యం కాదు అది బయట కానవ్వండి లేదా ఆలోచనలో కానివ్వండి”.[ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, భాగం2, పేజీ171].
రిఫ్రెన్స్
సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.
వ్యాఖ్యలు
Masha allah
Shukriya... Iltemase dua.
వ్యాఖ్యానించండి