ఇమామ్ హసన్[అ.స] ప్రతిష్టత

మంగళ, 11/14/2017 - 05:59

.మనిషి యొక్క ప్రతిష్టత తెలిసే మార్గాలలో ఒకటి, అతడి కన్న పెద్దవారు అతడి గురించి చెప్పడం.

ఇమామ్ హసన్[అ.స] ప్రతిష్టత

సహీ బుఖారీలో అబూబక్ర్ ఉల్లేఖనం ఇలా ఉంది:
رايت النبي صلي الله عليه و آله علي المنبر والحسن بن علي معه وهو يقبل علي الناس مرة و ينظر اليه مرة و يقول ابني هذا سيد అనువాదం: నేను దైవప్రవక్త[స.అ]ను చూశాను, అప్పుడతను పీఠం పై ఉన్నారు, మరి హసన్ ఇబ్నె అలీ[అ.స] కూడా వారి ఒళ్ళో ఉన్నారు, వారు ఒకసారి ప్రజలవైపు మరో సారి హసన్[అ.స] వైపు చూస్తూ ఇలా అనే వారు: నా ఈ కుమారుడు నాయకుడు, అధిపతి.[అల్ జామె అల్ సహీ, భాగం5, పేజీ31].
సీవ్తీ తన చరిత్ర గ్రంథంలో ఇలా వ్రాశారు: كان الحسن رضي الله عنه له مناقب كثيرة، سيدا حليما، ذا سكينة و وقار و حشمة، جوادا، ممدوحا అనువాదం: హసన్ ఇబ్నె అలీ[అ.స] చాలా సద్గుణాలు కలిగి ఉండేవారు. వారు గొప్పమనిషి, సహనశీలి, శుద్ధమైనవారు, ధర్మాత్ములు. ప్రతీ మంతి గుణానికి క్రేంద్రంగా ఉండేవారు.[తారీఖుల్ ఖులఫా, పేజీ189].
ఇది ముమ్మాటికి నిజం దైవప్రవక్త[స.అ] యొక్క పెద్ద మనవడు ఇలాగే ఉండాలిమరి. ఎందుకంటే ధర్మనిష్ఠగలవారు మంచి సద్గుణాలు కలిగి ఉంటారు. ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించారు: فالمتقون هم اهل الفضائل అనువాదం: ధర్మనిష్ఠగల వారే సద్గుణాలు కలిగి ఉన్నవారు. [నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్193].

రిఫ్రెన్స్
మొహమ్మద్ ఇబ్నె ఇస్మాయీల్ బుఖారీ, అల్ జామె అల్ సహీ, బీరూత్, దారు ఎహ్యాయిత్తురాస్ అల్ అరబీ.
సీవ్తీ, తారీఖుల్ ఖులఫా, బగ్దాద్, మక్తబతుల్ మస్నా, 1383 హిజ్రీ.
నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్193.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11