మన ఆత్మకు మనమే దారి చూపాలి

బుధ, 04/24/2019 - 13:44

రివాయతుల ద్వార మనకు తెలిసే విషయాన్ని కొన్ని ఉదాహారణలతో వివరించే ప్రయత్నం...

మన ఆత్మకు మనమే దారి చూపాలి

ఉదయాన్నే జాబ్ కోసమో లేదా స్కూల్ కోసమో లేదా వేరే పని కోసమో బస్సు ఎక్కుతాము, ఎక్కినప్పుడు అందులో కొన్ని సీట్లు ఖాలీగా ఉండి ఉంటే అందులో మేము కూర్చోకుండా నిలబడే ఉండిపోతే మెల్ల మెల్లగా అవి నిండిపోతాయి, ఇక మీరు కూర్చోవాలనుకున్నా కూర్చోలేరు. అలాగే మీ దగ్గర ఒక బండి ఉంది కానీ మీరు దాన్ని ఏదోక కారణంగా వాడటం లేదు మీ చుట్టుప్రక్కల వారు మీ నుండి ఆ బండి అప్పుడప్పుడు తీసుకొని వెళ్తున్నారు, కొన్ని రోజుల తరువాత ఆ బండిలో ఉన్న మంచి మరియు చెడు లక్షణాలు మీ కన్నా వారికే బాగా తెలుస్తాయి. అందరూ అది మీ బండి అనే అంటారు కాని నడిపేది మాత్రం మీ పక్కింటబ్బాయి లేదా వేరే ఒకరు. మీకు విసుకొచ్చి ఇలా ఎందుకయ్యింది అని ఆలోచిస్తే మీకే అర్థమౌతుంది, నేను నా బండిని వాడకపోవడం వలనే వాళ్ళూ వీళ్ళూ ఎక్కి కూర్చుంటున్నారని.
యదార్థమేమిటంటే మన వస్తువును మనం ఉపయోగించకపోతే వేరే వారు ఉపయోగిస్తారు, మన బండిని మనం వాడుకోకపోతే వేరే వారు ఎక్కి కూర్చుంటారు, అలాగే మన ఆత్మ పై మనం కూర్చోని దారి చూపించకపోతే వేరే వారు ఎక్కి దాన్ని దారి చూపుతారు.
నిన్ను నువ్వు అల్లాహ్ మార్గంలో నడిపించకోకపోతే షైతాన్ నీ ఆత్మపై ఎక్కి తనమార్గంలో తీసుకొని వెళ్తాడు. గుర్తుంచుకో!...

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12