ఫుజైల్ పశ్చాత్తాపం

బుధ, 04/24/2019 - 18:58

నిజమైన పశ్చాత్తాపనికి అద్దంపట్టే ఫుజైల్ బిన్ అయాజ్ యొక్క సంఘటన.

ఫుజైల్ పశ్చాత్తాపం

"ఫుజైల్ బిన్ అయాజ్" తన కాలపు ఒక ప్రసిధ్ధ దోపిడీ దొంగ. అతడి పేరు వింటే చాలు ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేవారు. ఒకరోజు అయాజ్ ఓ దొంగతనం నిమిత్తం ఒక గోడ ఎక్కినప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తిని దివ్యఖురాను యొక్క ఈ ఆయతును పఠిస్తుండగా విన్నాడు “ఏమిటీ విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా?”[అల్ హదీద్/16]. ఆయతు విన్న వెంటనే అయాజ్ లో ఒక రకమైన మార్పు సంతరించుకొని “ప్రభువా ఆ సమయం ఆసన్నమైంది” అని అరిచాడు. ఫుజైల్ ఆ భగవంతుని సన్నిధిలో తన పాపాల పట్ల పశ్చాత్తాప్పడి మరలా ఆ నాటి నుండి పాపాల జోలికి పోలేదు. చరిత్ర ఫుజైల్ ను ఇమాం సాదిఖ్[అ.స]ల వారి వద్ద విధ్యాభ్యాసం చేసిన వారిలో ఒకరిగా మరియు వారి నుండి హదీసులను ఉల్లేఖించేవారిగా పరిగణిస్తుంది. ఇదంతా ఒక నిజమైన పశ్చాత్తాపం వలనే.
ఫుజైల్ వలె మనకు కూడా దేవుని వైపు తరలి పోవటానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఆలోచించండి!!!

రెఫరెన్స్: ఇబ్నె ఖలకాన్ వఫయాతులు ఆయాన్,4వ భాగం,పేజీ నం:47.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16