.“నహ్ల్” సూరహ్ ను పఠిస్తే 70 వ్యాధుల నుండి సురక్షితంగా ఉంటారు, వాటిలో చాలా చిన్నవి పిచ్చి, కుష్టూ మొదలైనవి.
ఖుర్ఆన్ యొక్క పదహారవ సూరా ఇది. “నహ్ల్” అనగ తేనెటీగ. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 68వ ఆయత్. ఈ సూరాలో “నహ్ల్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరాలో 128 ఆయత్ లు, 1845 పదాలు మరియు 7838 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 84 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “కహఫ్” సూరా మరియు దీని తరువాత “నూహ్” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు “నహ్ల్” అని పెట్టడానికి కారణం అందులో తేనెటీగ ప్రస్తావన ఉండడం. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] వచనానుసారం ఎవరైనా నెలలో ఒక్క సారి నహ్ల్ సూరాను పఠించినా అతను ప్రాపంచిక కోరికలకు బానిస అవ్వడు. మరియు 70 వ్యాధుల నుండి సురక్షితంగా ఉంటాడు వాటిలో చాలా చిన్నవి పిచ్చి, కుష్టూ మొదలైనవి. మరి అతని స్ధానం స్వర్గంలో అతిఉత్తమ స్ధానం అయి ఉంటుంది.
వ్యాఖ్యానించండి