నమాజు స్వీకరణ పరిమాణం

శని, 04/27/2019 - 14:45

నమాజు స్వీకరింపబడినదా లేదా అన్న సందేహానికి ఇమాం సదిఖ్(అ.స)ల వారి జవాబు.

నమాజు స్వీకరణ పరిమాణం

మనం చేస్తున్న నమాజును ఆ అల్లాహ్ దృష్టిలో స్వీకరించబడినదా లేక తిరస్కరించబడినదా? అనే ప్రశ్న ఒక్కోసారి మనకు కలుగుతుంది. ఎందుకంటే హదీసులలో మీ నమాజు స్వీకరింపబడితేనే ఇతర సత్కార్యాలు స్వీకరింపబడతాయి, ఒకవేళ అదే తిరస్కరింపబడితే ఇతర సత్కార్యాలు కూడా తిరస్కరింపబడతాయి అని ఉంది. దానికి జవాబు పవిత్ర మాసూముల హదీసులో ఈ విధంగా వివరించబడి ఉంది. ఇమాం సాదిఖ్(అ.స)ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “తమ నమాజు స్వీకరింపబడిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నవారు, తమ నమాజు తమను పాపాలకు దూరంగా ఉంచుతుందా? లేదా? అనే విషయాన్ని గమనించాలి, ఎందుకంటే ఏ పరిమాణంలో అయితే తన నమాజు తమను పాపాలకు దూరంగా ఉంచుతుందో అదే పరిమాణంలో అతని నమాజు స్వీకరింపబడుతుంది”[బిహారుల్ అన్వార్, 82వ భాగం, పేజీ నం:198]. దివ్యఖురాన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిస్తుంది: “నమాజు నెలకొల్పు.నిశ్చయంగా నమాజు సిగ్గుమాలినతనం నుంచి,చెడు విషయాల నుంచి ఆపుతుంది”[అల్ అన్ కబూత్:45].  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 35