ప్రాయశ్చితం మాసూముల హదీసులలో

బుధ, 05/01/2019 - 18:41

ప్రాయశ్చితానికి సంబంధించిన మాసూముల కొన్ని ఉల్లేఖనలు. 

ప్రాయశ్చితం మాసూముల హదీసులలో

1. ఇమాం సాదిఖ్[అ.స]ల వారితో ఈ ఆయతు గురించి ప్రశ్నించటం జరిగింది, "మా ఆయతులను అసత్యమని ధిక్కరించిన వారిని మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా మా ఉచ్చులో బిగిస్తూ పోతాము"[అల్ ఆరాఫ్/182]. ఇమాం[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “ఏ దాసుడైతే పాపానికి పాల్పడినాడో అప్పుడు ఒక వరాన్ని ప్రసాదించటం జరుగుతుంది. అప్పుడు ఆ వరం ఆ వ్యక్తిని తాను చేసిన పాపాన్ని విస్మరించి దాని పట్ల నిర్లక్ష్యం వహించేటట్లు చేస్తుంది”[ఉసూలె కాఫి, 3వ భాగం, బాబుల్ ఇస్తెద్రాజ్].
2. ఇమాం రిజా[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ప్రాయశ్చితం యొక్క ఉపమానం చెట్టుకు గల ఆకు లాంటిది(ఆకులు రాలే కాలంలో) గాలికి ఆ చెట్టు ఊగటం వలన ఆకు రాలిపోవటం జరుగుతుందో(అదే విధంగా ప్రాయశ్చితం వలన పాపాలు కూడా చెరిగిపోతాయి), ఎవరైతే పాపాలపై ప్రాయశ్చితం చెంది మరలా అదేవిధంగా పాపాలు చేస్తాడో అతడు తన ప్రభువును హేళన చేసిన వాడవుతాడు”.
3. ఇమాం సాదిఖ్[అ.స]ల వారు వేరే హదీసులో ఈ విధంగా ఉల్లేఖించారు: “ఎప్పుడైతే విశ్వాసుడు పాపానికి పాల్పడతాడో అతనికి ఏడు గంటల గడువు ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ అతను (ఆ సమయంలోపు) దేవునిని ప్రాయశ్చితం కోరుకున్నట్లైతే అతని కర్మ పత్రంలో ఎటువంటి పాపము లిఖించబడదు”[అల్ కాఫి, బాబుల్ ఇస్తెగ్ఫార్, హదీసు నం:3].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17