దైవప్రవక్త[స.అ] యొక్క మొదటి ఉత్తరాధికారి

మంగళ, 08/22/2017 - 10:32

.

దైవప్రవక్త[స.అ] యొక్క మొదటి ఉత్తరాధికారి

హజ్రత్ అలీ[అ.స], దైవప్రవక్త(స.అ) యొక్క మొదటి ఉత్తరాధికారి, ఇతని కున్నియత్ “అబుల్ హసన్” మరియు బిరుదు “అమీరుల్ మొమినీన్”. తండ్రి పేరు అబూతాలిబ్[అ.స] మరియు తల్లి పేరు ఫాతెమ బింతె అసద్[అ.స]
ఇతను అరబీ మాసముల ప్రకారం రజబ్ మాసం, 13వ తేదీ, ఆముల్ ఫీల్ 30వ ఏట మక్కాలో ఉన్న కాబాలో జన్మించారు.
హజ్రత్ అలీ[అ.స]యే ముస్లింల అసలైన ఖలీఫా మరియు ఉత్తరాధికారి. ఈ విషయాన్ని దైవప్రవక్త[స.అ] తమ చివరి హజ్ యాత్ర పూర్తి చేసుకొని మక్కా నుండి మదీనా వైపు వెళ్తుండగా గదీర్ అనబడు మైదానంలో అల్లాహ్ ఆదేశం ప్రకారం అందరి ముందు ఇలా ప్రకటించారు:“من کنت مولاہ فھذا علی مولاہ” అనువాదం: “నేను ఎవరికైతే మౌలా(స్వామి)నో ఈ అలీ కూడా వారికి మౌలా(స్వామి)”.
పవిత్ర రమజాన్ మాసంలో కపటవర్తనులు పన్నిన పన్నాగాన్ని ఇబ్నె ముల్జిమ్ అనబడే వ్యక్తి నిజపరుస్తూ, హజ్రత్ అలీ[అ.స] నమాజ్ చదువుతుండగా విషంతో కూడివున్న ఖడ్గంతో అతని తల పై దాడి చేశాడు. దాని ప్రభావం వలనే మూడు రోజుల తరువాత హజ్రత్ అలీ[అ.స] మరణించారు. [ముంతహల్ ఆమాల్, ఇమామ్ అలీ[అ.స]కు సంబంధించిన అధ్యాయం నుండి]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మి, ముంతహల్ ఆమాల్,  ఇమామ్ అలీ[అ.స]కు సంబంధించిన అధ్యాయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6