అహ్లెబైత్[అ.స] పట్ల ప్రేమ

మంగళ, 01/09/2018 - 04:54

.ఖుర్ఆన్, దైవప్రవక్త[స.అ] దౌత్యనికి మరియు ప్రతిష్టమైన అనుగ్రహాలకు ప్రతిఫలంగా నిర్ధారించిన దానిలో ఒక్క ముస్లిముకు కూడా సందేహం లేదు.

అహ్లెబైత్[అ.స] పట్ల ప్రేమ

అల్లాహ్, దైవప్రవక్త[స.అ] దౌత్యనికి మరియు ప్రతిష్టమైన అనుగ్రహాలకు ప్రతిఫలాన్ని అహ్లెబైత్[అ.స]లను ఇష్టపడడాన్ని విధిగా నిర్ధారించాడు, అన్న విషయంలో ఒక్క ముస్లిముకు కూడా సందేహం లేదు. ఎందుకంటే అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా ప్రవచించెను:
قُل لَّآ أَسۡ‍َٔلُكُمۡ عَلَيۡهِ أَجۡرًا إِلَّا ٱلۡمَوَدَّةَ فِي ٱلۡقُرۡبَىٰ
అనువాదం: ఓ ప్రవక్తా! వారికి చెప్పు: మీ నుండి (దౌత్యానికిగాను) ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరను, బంధు(పట్ల) ప్రేమను తప్ప.[షూరా సూరా, ఆయత్:23]
ఈ ఆయత్, ముస్లిముల పై పవిత్ర ఇత్రత్[అ.స] అనగా అలీ[అ.స], ఫాతెమా జహ్రా[అ.స], హసన్[అ.స] మరియు హుసైన్[అ.స]ను ఇష్టపడడాన్ని వాజిబ్ గా నిర్ధారిస్తుందని అహ్లెసున్నత్ వల్ జమాఅత్ ల ముప్ఫై కన్న ఎక్కువ మూల గ్రంథాలలో వ్రాసి ఉంది.
ఇమామ్ షాపెయీ ఇలా అన్నారు:
یا اهل بیت رسول الله حبکم      فرض من الله فی القرآن انزله
అనువాదం: “ఓ దైవప్రవక్త[స.అ] యొక్క అహ్లెబైత్[అ.స]లారా! మీ పట్ల ప్రేమను ఖుర్ఆన్ వాజిబ్ గా నిర్ధారించింది”.
వారి పట్ల ప్రేమను ఖుర్ఆన్ లో ముస్లిములందరి పై వాజిబ్ గా నిర్ధారించబడింది. ఇమామ్ షాఫెయీ కూడా దానిని అంగీకరించారు, వారి పట్ల ప్రేమ ముహమ్మద్[స.అ] యొక్క దౌత్యప్రతిఫలం అని స్పషంగా చెప్పబడింది. వారి పట్ల ప్రేమ భక్తికి నిదర్శనం, అది అల్లాహ్ సామిప్యానికి కారణంగా నిలుస్తుంది.
మరి కొంతమంది ముస్లిములు అహ్లెబైత్[అ.స]ను ఎందుకని ఇష్టపడరు!, వారి ఇంటిని ఎందుకు నిప్పంటించారు!, వారిని లెక్కచేయకుండా ఎందుకు మిగిలిన సహాబీయులతో సమానంగా భావిస్తారు!, అంతేకాదు కొందరైతే మిగిలిన సహాబీయుల కన్న తక్కువగా చేసి మాట్లాడతారు. ఆలోచించండి!.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20