దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారుల జ్ఞానం

సోమ, 01/31/2022 - 04:05

దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారుల మరియు ఇమాముల జ్ఞానం, దైవజ్ఞానం అయి ఉంటుంది. అది వారికి వారి శ్రేష్ఠమైన తండ్రీ మరియు పితామహుల నుండి వారసత్వంగా లభించింది.

దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారుల జ్ఞానం

దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారుల మరియు ఇమాముల జ్ఞానం, దైవజ్ఞానం అయి ఉంటుంది. అది వారికి వారి శ్రేష్ఠమైన తండ్రీ మరియు పితామహుల నుండి వారసత్వంగా లభించింది.
వీరి గురించే అల్లాహ్ ఇలా ప్రవచించెను: ثُمَّ أَوۡرَثۡنَا ٱلۡكِتَٰبَ ٱلَّذِينَ ٱصۡطَفَيۡنَا مِنۡ عِبَادِنَا
అనువాదం: ఆ తరువాత మా దాసులలో మేము ఎన్నుకున్నవారిని (ఈ) గ్రంథానికి వారసులుగా చేశాము.[ఫాతిర్ సూరా:35 ఆయత్:32]    
ఒకసారి ఇమామ్ సాదిఖ్(అ.స), ఈ యదార్థాన్ని సూచిస్తూ ఇలా ప్రవచించారు: “ఆశ్చర్యకరం! ప్రజలు అంటూ ఉంటారు, వారు జ్ఞానమంతా దైవప్రవక్త(స.అ) నుండి పొందారు మరియ దాని పై అమలు చేసి రుజుమార్గాన్ని పొందారు మరియు ఇలా అంటారు మేము అహ్లెబైత్(అ.స)లం, దైవప్రవక్త(స.అ) నుండి జ్ఞానాన్ని పొందలేదు మరియు అలాగే రుజుమార్గం కూడా దక్కలేదు నిజానికి మేము దైవప్రవక్త(స.అ) యొక్క సంతానం. మా ఇంట్లోనే వహీ(దైవవాణి) అవతరించింది మరియు మా ద్వారం విజ్ఞానఉత్పత్తిస్థానం, దాని నుంచే ప్రజలు తమ జ్ఞాన దప్పికను తీర్చుకుంటారు. అయితే మీరు వాళ్ళను సన్మార్గులు మరియు పూర్తిగా జ్ఞానంతో నిండి ఉన్నవారు మరియు మమ్మల్ని అజ్ఞానం మరియు మార్గభ్రష్టతలో ఉన్నట్లు భావిస్తున్నారా?”.

మరి ఎవరైతే మేము దైవప్రవక్త(స.అ) నుండి జ్ఞానాన్ని పొందాము అని వాదిస్తున్నారో, నిజానికి వారికి  దైవప్రవక్త(స.అ) యొక్క వారసులైన అహ్లెబైత్(అ.స)లతో శత్రుత్వం ఉంది. ఇలాంటి వారిపై ఇమామ్ జాఫర్ సాదిఖ్‌(అ.స)కు ఎందుకని ఆశ్చర్యం కలగ కూడదు!
అహ్లెసున్నత్
లు ఎవరైతే అక్రమంగా, స్వయంగా తమని సున్నత్‌తో కలుపుకున్నారు, దీనిపై ఆశ్చర్యం కలగాల్సిందే, ఎందుకంటే వారు సున్నత్‌కు వ్యతిరేకంగా అమలు చేస్తారు.
చరిత్ర పరంగా చూస్తే షియాలు, అలీ(అ.స)ని ఆశ్రయించారు. అందుకని వారు అలీ(అ.స)ని మద్దత్తు ఇస్తూ వచ్చారు. మరియు అతని శత్రువును ఎదురుకుంటూ వచ్చారు. వారు ఎవరితో సంధి చేస్తే వారితో సంధి చేసుకుంటూ వచ్చారు. వారిలో ప్రతీ ఒక్కరు అతని నుండే జ్ఞానాన్ని పొందారు.

అహ్లెసున్నత్
లు ఖచ్చితంగా అలీ(అ.స)ని ఆచరించలేదు. అలాగే అతనికి మద్దత్తు కూడా ఇవ్వలేదు. అంతే కాకుండా దానికి విరుద్దంగా అతనితో యుద్ధం చేశారు. అతని ప్రాణదీపాన్ని ఆర్పివేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకనే అతని తరువాత అతని సంతానాన్ని వెతికి వెతికి చంపారు. బంధించారు, పట్టణాల నుండి బహిష్కరించారు. అహ్లెసున్నత్‌లు చాలా అహ్కాములలో అలీ(అ.స)ని వ్యతిరేకించారు. ప్రజలలో తమ స్వయపరియాలోచన మరియు ఇజ్తిహాద్ ద్వార అల్లాహ్ ఆదేశాలను మార్చేసినటువంటి, వారిని అనుసరించారు.
ఈనాడు మనకు వారి పై ఎందుకు ఆశ్చర్యం కలగకూడదు! వారు దైవప్రవక్త(స.అ) సున్నత్
పై అమలు చేస్తామని వాదిస్తారు. మరి స్వయంగా వారే మేము దైవప్రవక్త(స.అ) సున్నత్
ని వదిలేశాము, అని సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే “సున్నత్”, షియాల చిహ్నంగా మారిపోయింది గనక.[1] ఇది వింత విషయం కాదా?!.

మనకు వారి పై ఎందుకని ఆశ్చర్యం కలగకూడదు, వారు తమను “అహ్లె సున్నత్ వల్ జమాఅత్”లు అని అనుకుంటున్నారు. నిజానికి వారు హనఫీ, మాలికీ, షాఫెయీ, హంబలీ అని పలు వర్గాలుగా విభజించబడి ఉన్నారు. ఫిఖా విషయంలో ఒకరిని ఒకరు వ్యతిరేకిస్తారు. అంతేకాకుండా ఈ వ్యతిరేకత, కారుణ్యానికి కారణం! అని కూడా గౌరవంగా చెప్పుకుంటారు. అలా అల్లాహ్ యొక్క ధర్మం, వారి మనోవాంఛ మరియు సొంత అభిప్రాయాల లేహ్యముగా మారింది.
పలు పార్టీలు ఉన్నాయి, ఇవి అల్లాహ్ అహ్కాములలో మరియు దైవప్రవక్త(స.అ) విషయంలో వేరువేరుగా ఉన్నారు. కాని సఖీఫాలో నిశ్చయించబడ్డ ఆ అన్యాయ ఖిలాఫత్‌ను సరైనది, అన్న విషయంలో మాత్రం అందరి అభిప్రాయం ఒకటే. మరియు అలాగే ఆ ఖిలాఫత్ నుండి పవిత్ర అహ్లెబైత్(అ.స)లను దూరంగా ఉంచడంలో కూడా ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు.
మనకు వారి పై ఎందుకని ఆశ్చర్యం కలగకూడాదు, వారు స్వయంగా తమను “అహ్లె సున్నతులం” అని చెప్పుకొని గర్వపడతారు. మరియు దైవప్రవక్త(స.అ) యొక్క ఈ ఆదేశం “అల్లాహ్ గ్రంథం మరియు నా అహ్లెబైత్(అ.స)‌ను ఆశ్రయించండి”ను వదిలేస్తారు. అహ్లెసున్నత్‌లు ఈ హదీస్‌ను తమ గ్రంథాలలో వ్రాసినప్పటికీ మరియు దానిని సరైన హదీస్ అని నమ్మినా సరే, వారికి ఖుర్ఆన్
తో గాని లేదా అహ్లెబైత్(అ.స)తో గాని ఎటువంటి సంబంధం లేదు. వాస్తవానికి అహ్లెబైత్(అ.స) పట్ల విముఖం, ఖుర్ఆన్ నుండి ముఖము త్రిప్పుకున్నట్లే. హదీస్‌లో ఉన్నట్లు; “ఖుర్ఆన్ మరియు అహ్లెబైత్(అ.స) ఎన్నడూ ఒకరి నుండి ఒకరు దూరం అవ్వరు”, ఎలాగైతె దైవప్రవక్త(స.అ) మనకు చెప్పారో అలాగే. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: నాకు దయామయుడు మరియు సర్వజ్ఞాని ఈ వార్తను అందించాడు, ఈ రెండు(ఖుర్ఆన్ మరియు ఆహ్లెబైత్(అ.స)) ఎట్టిపరిస్థితులలో కూడా కౌసరే సేలయేరు వద్ద నాతో కలవనంత వరకు వేరుకారు.[2]

రిఫరెన్స్
1. గౌరవనీయులైన పాఠకులారా! ఈ క్రమంలో “لاکون مع الصادقین” ను చదవండి, ఇబ్నె తైమియా ఇలా అన్నారు; దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వదిలేయండి, ఎందుకంటే ఇక సున్నత్ షియాల గుర్తుగా మారిపోయింది, అయినప్పటికీ అహ్ల సున్నత్
లు ఇబ్నె తైమియాను ముజద్దిదుస్సున్నహ్ (సున్నత్ పునరుద్ధారకుడు) అని అంటారు. మిన్హాజుస్సున్నహ్, ఇబ్నె తైమియా, భాగం2, పేజీ143. షర్హుల్ మవాహిబ్, జర్ఖాని, భాగం5, పేజీ12.
2. ముస్నద్, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం5, పేజీ189. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ148. హాకిం ఇలా అన్నారు: షైఖైన్
లు రావీయుల క్రమంలో ఉంటే సరైన హదీస్. జహబీ కూడా షైఖైన్
ల షరత్తు ద్వారానే ఈ హదీస్ సరైనది అని భావించారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14