.దైవప్రవక్త[స.అ] ఖలీఫా మరియు ఉత్తరాధికారి ఎన్నిక సలహామండలి పై విడిచారు అని అనడం ముమ్మాటికి అసత్యం.
ఎవరైతే దైవప్రవక్త[స.అ] ఖలీఫా మరియు ఉత్తరాధి కారి ఎన్నిక సలహా మండలి పై విడిచారు అని చెప్పి వారి సున్నత్ ను వ్యతిరేకించిన ఈ ముస్లిముల ఖబ్జా ఇస్లామీయ ఖిలాఫత్ లేదా అధికారుల పై ఉండడం వల్ల వారు ప్రపంచమంతటా వ్యాపించారు. ఈ విధంగా మీరు వారిని ఇస్లామీయ చరిత్రలో మరియు ఈనాడు సౌదీ అరేబీయా మరియు పశ్చిమ ప్రాంతాలలో, ఉర్దున్
లో, అన్ని గల్ఫ్ కంట్రీస్
లో “ఖలీఫా వారసత్వ” పద్దతినే ఆచరించడాన్ని చూస్తున్నారు. ఒకవేళ “దైవప్రవక్త[స.అ] ఖలీఫా ఎన్నికను సలహా మండలి మరియు ఖుర్ఆన్ పై వదిలేశారు” అన్న విశ్వాసాన్ని సరైనది అని అంగీకరించినట్లైతే కూడా సహాబీయులు ఖుర్ఆన్ మరియు హదీస్
ను వ్యతిరేకించి సలహామండలి, డెమోక్రసీ పరిపాలనను వారసత్వ మరియు అధినాయక తంత్రముగా(Dictatership) మార్చేశారు.
ఒకవేళ అలీ ఇబ్నె అబీతాలిబ్[స.అ] యొక్క ఖిలాఫత్ పై దైవప్రవక్త[స.అ] స్పష్ట ఆదేశం ఉంది అని అనుకుందాం, అయితే అప్పుడు కూడా వారు దైవప్రవక్త[స.అ] స్పష్ట హదీస్ మరియు ఖుర్ఆన్
ను వ్యతిరేకించారు, ఎందుకంటే దైవప్రవక్త[స.అ] అల్లాహ్ అనుమతి లేకుండా ఏ కార్యమును చేసేవారు కాదు.
వ్యాఖ్యానించండి