అల్లాహ్ మన కంటికి కనబడతాడు అనే విశ్వాసాన్ని స్వయంగా ఖుర్ఆన్ రద్దు చేస్తుంది.
అల్లాహ్కు సంబంధించిన విషయాలలో ముఖ్యమైనది “రూయతే బారి”(అనగా అల్లాహ్, మన కంటికి కనబడతాడు) అనే అంశం. కొందరు “అల్లాహ్కు కూడా రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు, ఒక ముఖం ఉన్నాయి” అని అంటారు, మరియు అయన కనబడతాడు అని అంటారు.
కాని ఖుర్ఆన్ ఈ విశ్వాసాలను రద్దు చేస్తూ ఇలా ప్రవచిస్తుంది:
1. ఆయత్: لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞ; ఆయనను పోలిన వస్తువు సృష్టిలో ఏదీ లేదు[షూరా సూరా:42, ఆయత్:11]
2. ఆయత్: لَّا تُدۡرِكُهُ ٱلۡأَبۡصَٰرُ ; చూపులు ఆయనను అందుకోలేవు[అన్ఆమ్ సూరా:6, ఆయత్:103]
ప్రవక్త మూసా(అ.స) రూయత్(అల్లాహ్ దర్శనం) గురించి ప్రశ్నించినపుడు అల్లాహ్ ఇలా ప్రవచించెను:
3. ఆయత్: لَن تَرَىٰنِي; (అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:) నీవు నన్ను చూడలేవు[ఆరాఫ్ సూరా:7, ఆయత్:143]
రిఫ్రెన్స్
ఖుర్ఆన్ మజీద్
వ్యాఖ్యలు
Masha a Allah
Shukriya.. Iltemase dua...
వ్యాఖ్యానించండి